https://oktelugu.com/

నవరాత్రి, దసరా పూజల తర్వాత మీ ఇంట్లో చాలా పువ్వులు ఉంటాయి కదా. వాటిని పారేయకుండా ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు.

Images source: google

కీటకాలు నాశనం: పూజ పువ్వులను ఉపయోగించి కీటక నాశక స్ప్రేను కూడా  తయారు చేసుకోవచ్చు. నీటిలో మరిగించి వడపోసి స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఈ నీటిని వాడుకుంటే సరిపోతుంది.

Images source: google

పాట్‌పూరీ మేకింగ్: ఎండిన పువ్వుల రేకులతో కొన్ని చుక్కల రోజ్ ఆయిల్ కలపాలి. దీంతో పాట్‌పూరీ తయారు అవుతుంది. దీన్ని అలంకరణకు, సువాసనకు వాడవచ్చు.

Images source: google

సెంట్ తయారు: ఎండిన పువ్వులను నీటిలో మరిగించాలి. వీటి రంగు, సువాసన నీటిలోకి వచ్చాక చల్లార్చాలి. దానికి తగినంత నూనె కలిపాలి. దీంతో మంచి సువాసన స్ప్రే తయారు అవుతుంది.

Images source: google

సహజ రంగుల తయారీ: బంతి పువ్వులను నీటిలో మరిగిస్తే సహజ రంగులు తయారు అవుతాయి. రకరకాల పూల నుంచి వేర్వేరు రంగులు కూడా తయారు చేసుకోవచ్చు.

Images source: google

ధూపం: ఎండిన పుష్పాలతో కర్పూరం, 1-2 ధూపం కలిపి సువాసన ఇచ్చే ధూపం తయారు చేసుకోవచ్చు.

Images source: google

సాంబ్రాణి కప్పులు: ఎండిన పువ్వుల రేకులతో పేడ, కర్పూరం, నెయ్యి కలిపి సాంబ్రాణి తయారు చేసుకోవచ్చు. దీన్ని మళ్లీ పూజా మందిరంలో ఉపయోగించవచ్చు.

Images source: google

మైనపువత్తుల తయారీ: మైనం కరిగించి అందులో రోజా లేదా బంతి పూల రేకులు కలిపాలి. అంతే మైనపు వత్తులు తయారు అవుతాయి.

Images source: google