https://oktelugu.com/

పోషకాల నిధి: కివీలో విటమిన్ సి ఉంటుంది. దీంతో పాటు క్యాల్షియం, ఐరన్, బి6, మెగ్నీషియం, ఫైబర్ , పొటాషియంలు కూడా ఉంటాయి.

Images source: google

ప్రయోజనాలు: డెంగ్యూ, చికెన్‌గున్యా నుంచి కోలుకునేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తహీనతను అధిగమిస్తుంది కివీ.

Images source: google

హానీ కూడా: కివీ పోషక గుణాల భాండాగారం కాబట్టి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. అయినా సరే  కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కివీ హాని చేస్తుందట.

Images source: google

అలెర్జీ:  అలెర్జీ ఉన్నవారు కివీని తినవద్దు. లేదంటే దద్దుర్లు, దద్దుర్లు, దురదలు, తుమ్ములు, పుండ్లు వంటి సమస్యలు వస్తాయి.

Images source: google

కిడ్నీ సమస్య: కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కివికీ దూరంగా ఉండాలి. ఇందులో పొటాషియం, ఆక్సలేట్ లు కూడా ఉంటాయి.

Images source: google

GERD సమస్య: GERD అంటే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు కివి ముట్టుకోవద్దు. లేకుంటే గుండెల్లో మంట, పుల్లని త్రేనుపు సమస్యలు వచ్చే సమస్య ఉంది.

Images source: google

మందులు తీసుకుంటున్నారా: రక్తపోటును నియంత్రించుకోవడానికి మందులు వాడుతుంటే కివీని రోజూ తినవద్దు. కివీని రోజూ తినడం వలన బీపీలో హెచ్చుతగ్గులు వస్తాయి అంటన్నారు నిపుణులు.

Images source: google

జీర్ణ సమస్యలు: కివీలో అధికంగా ఉండే పీచు వల్ల అతిసారం, కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి జాగ్రత్త.

Images source: google