మభ్యపెట్టడంలో మాస్టర్ చేసాయి కావచ్చు ఈ జంతువులు

వేటాడటానికి కొన్ని జంతువుల బలే ట్రిక్స్ ఫాలో అవుతాయి. ఇక కొన్నింటికి మాత్రం అదృష్టంగా వాటి శరీర ఆకృతి ఉంటుంది.

Image Credit : google

Image Credit : google

కొన్ని జంతువులు మభ్యపెట్టడంలో ఆరితేరాయి. డిగ్రీలు చేసాయి అనిపిస్తాయి వీటిని చూస్తే. రంగులు మారుస్తూ, పరిసరాలకు అనుగుణంగా మారడం చూస్తే భలే అనిపిస్తుంటుంది. మరి ఆ జంతువులు ఏంటో ఓ సారి తెలుసుకోండి.

Image Credit : google

పిగ్మీ సముద్ర గుర్రాలు ప్రపంచంలోనే అతి చిన్న సముద్ర గుర్రాలు. వాటి పరిమాణం, ఉష్ణమండల పగడపు దిబ్బల వాతావరణంలో మిళితమై ఉంటాయి. అందుకే వాటికి అవి సులభంగా రక్షించుకుంటాయి.

Image Credit : google

జెయింట్ లీఫ్-టెయిల్డ్ జెక్కోస్.. ఇదొక రకమైన బల్లి. వాటి శరీరాల మీద ఒక రకమైన చర్మపు ఫ్లాప్ కలిగి ఉంటాయి. ఇవి చెట్టు బెరడు మీద ఉంటే కనిపెట్టడం కష్టమే. దీన్ని గుర్తుపట్టడం కూడా కష్టమే.

Image Credit : google

లీఫ్ లిట్టర్ టోడ్ అంటే ఇదొక రకమైన కప్ప.  ఎండిపోయిన ఆకు మాదిరి ఉంటుంది. అయితే ఆకులను తినే కీటకాలు ఆకులు అనుకొని వీటిని తినడానికి వస్తే వాటినే ఇవి తినేస్తాయి.

Image Credit : google

ఫోటోలో చూస్తున్న మాదిరి సాలీడులు పుటాకార బొడ్డు చెట్టు, వంపు చుట్టూ చదును చేయడానికి వీటి వింగ్స్ ఉంటాయి. కానీ ఇవి ఎండిన చెట్టు బెరడు మాదిరి ఉంటాయి కాబట్టి గుర్తుపట్టడం కష్టమే.

Image Credit : google

డెకరేటర్ పీతలు తమను తాము స్పాంజ్‌లు, పగడాలు, సముద్రపు పాచితో అలంకరించుకుంటాయి. వాటిని గుర్తించడం కష్టంగా ఉంటుంది.

Image Credit : google

కొన్ని గుడ్లగూబలు తమ నివాస స్థలంలోని చెట్లను పోలి ఉండే ఈకలను కలిగి ఉంటాయి. అందులో కలిసిపోయేలా ఉంటాయి. కొన్నిసార్లు మరింత కనిపించకుండా ఉండటానికి జాగ్రత్త పడతాయి కూడా.

Image Credit : google

గ్రీన్ స్నేక్ లను కూడా చూసే ఉంటారు. ఇవి కూడా పచ్చటి చెట్ల మీద ఉన్నప్పుడు గుర్తు పట్టడం చాలా కష్టం. జాగ్రత్తగా చూస్తే, లేదా పాము కదిలినప్పుడు మాత్రమే వాటిని గుర్తించడం సాధ్యం అవుతుంది.