వైల్డ్ లైఫ్ ఫోటో గ్రఫీకి ఈ చిట్కాలు చాలా ఉపయోగపడతాయి..

Images source: google

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ గ్రేట్ కద. జంతువులను చాలా అద్భుతంగా చూపిస్తుంటారు. వాటిని కళ్ల ముందు ఉన్నట్టే చూడవచ్చు. అయితే కొన్ని చిట్కాల వల్ల ఈ వైల్డ్ లైఫ్ ఫోటోలు మరింత అద్భుతంగా వస్తాయి. అవేంటంటే..

Images source: google

పరిశోధన: ఫోటో తీయడానికి ముందే ఆ జంతువు గురించి తెలుసుకోండి. వాటి ప్రవర్తన, అలవాట్లు, ఆవాసాలను అర్థం చేసుకోవడం, వాటి కదలికలను అంచనా వేయడానికి సహాయపడుతుంది.

Images source: google

లెన్స్: జంతువులకు ఇబ్బంది కలగకుండా దూరం నుంచి కెమెరా పట్టుకోవాలి. దీనికోసం మంచి జూమ్ లేదా టెలిఫోటో లెన్స్ (300 మిమీ లేదా అంతకంటే ఎక్కువ) అవసరం.

Images source: google

గోల్డెన్ అవర్: వన్యప్రాణి ఫోటోగ్రఫీకి మంచి టైమ్ "గోల్డెన్ అవర్స్".  తెల్లవారుజామున, మధ్యాహ్నం ఫోటోలు సూపర్ గా వస్తాయి. ఈ సమయంలో జంతువులు, వాటి పరిసరాల సహజ సౌందర్యంగా కనిపిస్తాయి.

Images source: google

ఓపిక: వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీలో ఎక్కువసేపు వేచి ఉండటం, ఓపిక అవసరం. నిశ్చలంగా ఉంటూ.. నిశ్శబ్దంగా గమనించండి. జంతువులను మీ వద్దకు రానివ్వద్దు.

Images source: google

బర్స్ట్ మోడ్: వన్యప్రాణులు వేగంగా కదులుతాయి. పర్ఫెక్ట్ షాట్ రావాలంటే కష్టమే. అందుకే ఎక్కువ క్యాప్చర్ చేస్తుండండి. నిరంతర షూటింగ్ మోడ్ లో ఉండండి.

Images source: google

భంగం: జంతువుల నుంచి సరైన దూరం ముఖ్యం. వాటి లైఫ్ కు కూడా మీరు భంగం కలిగించవద్దు.

Images source: google