Images source: google
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో లోనావాలా ఉంది. ఇది సుందరమైన అందం పచ్చదనంతో కూడి ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ హిల్ స్టేషన్ మనసును మైమరిపిస్తుంది.
Images source: google
లోనావాలా పూణే నుంచి 67 కిమీ, ముంబై నుంచి 95 కిమీ దూరంలో ఉంది. రోడ్డు, రైలు లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న టాప్ 5ప్లేస్ లు ఏంటంటే..?
Images source: google
లోనావాలా సరస్సు: చుట్టూ పచ్చదనంతో కూడిన ప్రశాంతమైన, అందమైన సరస్సు ఇది. బోటింగ్ చేయాలన్నా.. మంచి ఫోటోలు సోషల్ మీడియోలో అప్లోడ్ చేయాలన్నా సూపర్ స్పాట్ ఇది.
Images source: google
కునే జలపాతం: భారతదేశంలోని 14వ ఎత్తైన జలపాతం. 650 అడుగుల దిగువకు ప్రవహిస్తుంది. నిమిష నిమిషం ఎక్జైట్మెంట్, ఫుల్ కిక్ ఉంటుంది బ్రో.
Images source: google
లోహగడ్ కోట: 18వ శతాబ్దానికి చెందిన ఒక చారిత్రాత్మక కోట ఇది. చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఇక ట్రెక్కింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
Images source: google
భజ గుహలు: పురాతన బౌద్ధ శిలతో చేసిన దేవాలయాలు, గుహలు చూడటానికి కొత్త అనుభూతిని కల్పిస్తాయి. ఇవి క్రీ.పూ. 2వ శతాబ్దానికి చెందినవి.
Images source: google
భూషి డ్యామ్: పిక్నిక్‌లకు సూపర్ స్పాట్. వర్షాకాలంలో నీరు పొంగి ప్రవహించినప్పుడు.. మెట్ల మీదుగా నీరు ప్రవహిస్తున్నప్పుడు ఈ ప్లేస్ లో ఉండాలి. మర్చిపోలేము ఆ రోజును అనుకోండి.
Images source: google
కర్లా గుహలు: ఈ పురాతన బౌద్ధ రాక్-కట్ గుహలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినవి. పురాతన భారతీయ వాస్తుశిల్పానికి ఒక అద్భుతం. కర్లా గుహలు భారతదేశంలోని అతిపెద్దవి.
Images source: google