ఈ భూమి మీద ఒకే జాతికి చెందిన పక్షి లేదా జంతువు ఒకేలా ఉంటాయి. కానీ ఒక జాతికి చెందిన జంతువు.. మరో జాతి చెందిన జంతువులా ఉంటే ఆశ్చర్యమే..
అందులో శునకాలు తోడేలు లాగానో.. సింహం లాగానో ఉంటే.. ఉండడమేంటి .. ఈ శునకాలు నిజంగా అలానే ఉన్నాయి. ఇంతకీ ఆ కుక్కలు ఏమిటో, ఎక్కడ ఉన్నాయో ఓ లుక్కేయండి.
రకూన్ డాగ్స్.. అచ్చం కోతిలాగేరకూన్ జాతికి చెందిన కుక్కలు చూసేందుకు కోతి లాగానే ఉంటాయి. ఇవి పిల్లిలాగా అరుస్తాయి. నీళ్లల్లో చేపల లాగా ఈదుతాయి. చేపలు, నాచుముక్కలను ఆహారంగా తింటాయి. ఫాక్స్ ఫర్ రకం దుస్తుల తయారీలో ఈ కుక్కల బొచ్చును వాడతారు.
కీస్ హాండ్.. కొండముచ్చు లాంటి శునకంకీస్ హాండ్ జాతికి చెందిన శనకం కొండముచ్చు లాగానే ఉంటుంది. ఇది నల్లని ముఖాన్ని కలిగి ఉంటుంది. చూడ్డానికి చిన్నదిగా ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో దీనిని పెట్ డాగ్ లాగా పెంచుకుంటారు.
బుష్, వినెగర్ డాగ్స్.. ఎలుగుబంటి లాగానేబుష్, వినెగర్ డాగ్స్ చూసేందుకు అచ్చం ఎలుగుబంటి లాగానే ఉంటాయి. వీటి మూత్రం వినెగర్ వాసన వస్తుంది కాబట్టి.. వాటిని వినెగర్ డాగ్స్ అని పిలుస్తారు. ఇవి ఈత కొట్టడంలో అసాధారణ ప్రతిభ చూపిస్తాయి. పిట్టలను, చిన్న చిన్న జంతువులను వేటాడి తినేస్తాయి.
ఆఫ్రికన్ వైల్డ్ డాగ్.. హైనా కు డూప్లికేట్ఇది చూసేందుకు అచ్చం హైనా లాగే ఉంటుంది. ఇది గంటకు 37 నుంచి 44 కిలోమీటర్లు పరిగెత్తుతుంది. వీటి ఒంటిమీద ప్రత్యేకమైన మచ్చలు ఉంటాయి. ఈ కుక్కలు మందలుగా జీవిస్తుంటాయి.. ఒక్కటి గాయపడినా.. అది కోలుకునేంతవరకు మిగతావి ఆహారం ముట్టవు.
టిబెటన్ మాస్టిఫ్స్.. అచ్చం సింహం లాగేటిబెటన్ మాస్టిఫ్స్ డాగ్ చూసేందుకు సింహం లాగే ఉంటుంది. దీని ఆకారం భయం కలిగిస్తుంది. మచ్చిక చేసుకుంటే మాత్రం చెప్పినట్టు వింటుంది. నేపాల్, భూటాన్ దేశాల్లో ఈ కుక్కలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
వుల్ఫ్ డాగ్.. తోడేలు లాంటి కుక్కఇది చూసేందుకు తోడేలు కనిపిస్తుంది. వీటిని అలస్కాన్ మాలమ్యూట్ అని కూడా పిలుస్తుంటారు. మంచు ప్రాంతంలో ఈ కుక్క స్లెడ్జ్ బండి లాగేందుకు ఉపకరిస్తుంటుంది. దీని వేట అచ్చం తోడేలు పోలి ఉంటుంది. కూత కూడా అదే విధంగా ఉంటుంది.
బెడ్ లంగ్టన్ టెర్రేయిర్స్వీటి ఆకారం చూసేందుకు గొర్రె పిల్ల లాగా ఉంటుంది. కాకపోతే ఇవి అద్భుతంగా వేటాడుతాయి. అనితర సాధ్యమైన వేగంతో ఈత కొడతాయి. చాలామంది వీటిని చూసి గొర్రెలు అనుకుంటారు. దగ్గరికి వచ్చి పరిశీలిస్తే కానీ తెలియదు ఇవి కుక్కలని..
డౌల్ బ్రీడ్ డాగ్స్.. అచ్చం నక్క లాగేఈ కుక్కలు చూసేందుకు నక్కల లాగా కనిపిస్తాయి.. వీటిని ఇండియన్ వైల్డ్ డాగ్స్ అని కూడా పిలుస్తారు. కొన్ని ప్రాంతాలలో ఎర్ర కుక్కలు అంటారు. ఇవి అచ్చం నక్కలాగే అరుస్తాయి. వీటి తోక కూడా నక్కలాగే ఉంటుంది. ఇవి వేటాడటంలో నేర్పరులు.