https://oktelugu.com/

అడవుల్లో ఉన్న క్రూర మృగాలైన పులి, సింహం, జాగ్వార్, మచ్చల పులి, ప్యూమా, ధ్రువపు ప్రాంతపు పులి, బెంగాల్ టైగర్, చీతా... ఇవన్నీ పులి జాతికి చెందినవే.

ఆయా భౌగోళిక ప్రాంతాల వైవిధ్యం వల్ల అవి విభిన్నంగా ఉన్నాయి. ఇంతకీ వాటి లక్షణాలు ఏమిటో, వాటి మనుగడ ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆసియా సింహం ఈ సింహాలు చూసేందుకు చాలా బలంగా ఉంటాయి. సబ్ సహారా ప్రాంతాల్లో ఈ సింహాలు ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. మనదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని గిర్ అటవీ ప్రాంతంలో ఈ సింహాలు ఉన్నాయి.

బెంగాల్ పులి పశ్చిమ బెంగాల్లోని సుందర్ బన్ ఏరియాలో విస్తరించి ఉన్న అడవుల్లో ఈ పులులు ఉంటాయి.  కొంచెం పొడుగ్గా ఉంటాయి. వేటాడే విధానంలో వీటికివే సాటి. ఎంత పెద్ద జంతువునైనా ఇవి వేటాడేస్తాయి.

చిరుత ఒకప్పుడు మనదేశంలో ఇవి చాలా అడవుల్లో కనిపించేవి. వేటగాళ్ల ఉచ్చులకు బలైపోయాయి. అడవుల సంఖ్య తగ్గడం, వీటి ఆవాసాలకు ముప్పు ఏర్పడటంతో క్రమంగా వీటి సంఖ్య తగ్గిపోవడం ప్రారంభించింది

మచ్చల పులి దక్షిణ మండల ఆగ్నేయాసియా ప్రాంతాలలోని ఉష్ణ మండల అడవుల్లో ఈ పులి ఎక్కువగా కనిపిస్తుంది.   అడవుల సంఖ్య తగ్గడం, ఆహారం సక్రమంగా లభించకపోవడం, వేటగాళ్ల ఉచ్చులకు బలి కావడంతో వీటి సంఖ్య క్రమేపి తగ్గుతున్నది.

జాగ్వార్ పులి జాతులకు సంబంధించిన వాటిల్లో ఇది మూడవ అతిపెద్దది. ఒకప్పుడు అర్జెంటీనా నుంచి మొదలుపెడితే అమెరికా వరకు ఈ పులులు కనిపించేది. ప్రస్తుతం అమెజాన్ అడవులకు మాత్రమే పరిమితమైపోయాయి.

భారతీయ చిరుత పులి ఈ చిరుత పులి నల్లమల, గిర్, ఇంకా కొన్ని అటవీ ప్రాంతాలలో ఉంటుంది. ఈ పులులకు ఒంటిపై ప్రత్యేక చారలు ఉంటాయి. ప్రతీ పులి విభిన్నమైన చారలు కలిగి ఉంటుంది. దీని జన్యు వైవిధ్యం వల్లే ఇలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్యూమా ఇది పులుల్లో ఒక జాతి. దక్షిణ అమెరికా నుంచి దక్షిణ కెనడా వరకు విస్తృతంగా వృద్ధి చెందుతోంది. వేగంగా పరిగెత్తగల సామర్థ్యం, అవలీలగా జంతువులను వేటాడడం.. ఈ పులి ప్రత్యేక లక్షణాలు.

ధ్రువపు పులి దీనిని స్నో టైగర్ అని పిలుస్తుంటారు.  ధ్రువపు ప్రాంతాల్లో స్వేచ్ఛగా విహరించగలుగుతుంది. దీనిని పర్వతపు ప్రాంత దయ్యం అని కూడా పిలుస్తారు. దీని వేటాడే విధానం ఇతర పులులతో పోల్చితే పూర్తి విభిన్నంగా ఉంటుంది.

Off-white Banner

Thanks For Reading...