దట్టమైన అడవులు.. అందులో అందమైన సెలయేళ్లు.. క్రూరమైన మృగాలు.. సయ్యాటలాడే పక్షులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి రమణీయత వర్ణనకు అందదు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమమైన జాతీయ పార్కులేమిటో ఒకసారి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎల్లో స్టోన్, అమెరికా ఎల్లో స్టోన్ అనేది అమెరికా మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం.   వ్యోమింగ్ నుంచి ఇడాహో వరకు విస్తరించి ఉంది.  బైసన్, ఎలుగుబంట్లు, తోడేళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి. పచ్చిక భూములు, లోయలు ప్రధాన ఆకర్షణ.

సెరెంగేటి నేషనల్ పార్క్.. టాంజానియా టాంజానియాలోనిసెరేంగేటి నేషనల్ పార్క్ అత్యుత్తమమైన ఆఫ్రికన్ సఫారీ అనుభవాన్ని పర్యాటకులకు అందిస్తుంది.   కంచర గాడిదలు, ఆఫ్రికన్ దున్నపోతులకు ఈ ప్రాంతం ఆలవాలం. సింహాలు, చిరుతలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి.

బాన్ఫ్ నేషనల్ పార్క్, కెనడా కెనడాలోని రాకీస్ లో ఉన్న ఈ పార్క్ పర్యాటకులకు స్వర్గధామం లాంటిది. ఇందులో ఉన్న ఎత్తైన శిఖరాలు, సరస్సులు పర్యాటకులకు కొత్త అనుభూతులను కలిగిస్తాయి. ఇందులో ఉన్న విశాలమైన హిమానీనదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

టోర్రెస్ డెల్ ఫైన్ నేషనల్ పార్క్, చిలీ టోర్రెస్ డెల్ ఫైన్ నేషనల్ పార్క్ చిలీలో ఉంది..   శిఖరాలు, ఆకాశాన్ని తాకే వృక్షాలు, పురాతన నదులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.  అద్భుతమైన జీవావరణం ఉంటుంది.. సాహస యాత్రికులు వస్తుంటారు.. పర్వతాలను అధిరోహిస్తుంటారు.

క్రూగర్ నేషనల్ పార్క్, దక్షిణాఫ్రికా దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్..  అసలు సిసలైన ఆఫ్రికన్ సఫారీ అనుభవాన్ని అందిస్తుంది. సింహం, ఏనుగు, అడవి గేదె, చిరుత పులి, ఖడ్గమృగం వంటి జంతు శ్రేణికి ఈ పార్క్ ఆలవాలం.

Off-white Banner

Thanks For Reading...