https://oktelugu.com/

మన దేశంలో పులులు ఎక్కువగా ఉండే టాప్ 8 పార్కులు ఇవే..ఇందులో హైదరాబాద్ లేదుగా..

Images source: google

పులుల జాతి రోజు రోజుకు అంతరించి పోతుంది. కానీ ఇప్పటికీ కొన్ని పార్కుల్లో పులులు ఎక్కువగానే ఉన్నాయి. పులులు ఉన్న కొన్ని పార్కుల గురించి తెలుసుకుందాం.

Images source: google

రణతంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్: పెద్ద పులులు ఎక్కువగా ఉండే పార్క్ రణతంబోర్. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పార్కులలో ఒకటి.

Images source: google

బాంధవ్‌గర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్: బాంధవ్‌ఘర్ భారతదేశంలో అత్యధిక బెంగాల్ పులులను కలిగిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. చిన్నగా ఉంటుంది కాబట్టి పులులను సులభంగా చూడవచ్చు.

Images source: google

కన్హా నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్: కన్హాలో విస్తారమైన గడ్డి భూములు, దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ కూడా పులులు ఎక్కువగానే ఉన్నాయి.

Images source: google

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్: భారతదేశంలోని పురాతన జాతీయ ఉద్యానవనం కూడా ప్రాజెక్ట్ టైగర్ చొరవ కింద వచ్చిన మొదటి పార్క్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ విభిన్న ప్రకృతి దృశ్యాలకు, పులులకు ప్రసిద్ధి చెందింది.

Images source: google

తడోబా అంధారి టైగర్ రిజర్వ్, మహారాష్ట్ర: తడోబా మహారాష్ట్రలోని అత్యుత్తమ, అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ముఖ్యంగా అక్టోబర్‌లో పులిని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Images source: google

పెంచ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర: పెంచ్ నేషనల్ పార్క్ లో పులుల ఎక్కువ ఉంటాయి. టేకు, గడ్డి భూములు కూడా ఎక్కువే ఉంటాయి ఇందులో.

Images source: google

సుందర్బన్స్ నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్: సుందర్బన్స్ మడ అడవులు, నీటి ఆధారిత సఫారీలతో పులులకు ఇష్టమైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ పులిని గుర్తించడం సవాలే. కానీ చూడాలనే క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది

Images source: google