పరిచయం: మ్యూకోసిటిస్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్య ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసా?
Images source: google
ఎరుపు, వాపు: మ్యూకోసిటిస్ మొదటి సంకేతాలలో నోరు లేదా గొంతులో ఎరుపు, వాపు వంటివి కనిపిస్తాయి. చిన్నగా ఎర్రగా మారి కనిపిస్తాయి. క్రమంగా ఈ సమస్య మరింత బాధాకరంగా మారుతుంది.
Images source: google
పుండ్లు: నాలుక, చిగుళ్ళు బుగ్గల లోపలి భాగంలో బాధాకరమైన పుండ్లు , పూతల వంటివి ఏర్పడవచ్చు. దీనివల్ల తినడం, తాగడం చాలా కష్టంగా అనిపిస్తుంది.
Images source: google
పొడి నోరు: మ్యూకోసిటిస్ వల్ల తరచుగా నోరు పొడిబారుతుంది. మింగడం లేదా మాట్లాడటం కష్టతరం అవుతుంది. తరచుగా నీరు తాగడం వల్ల తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.
Images source: google
మింగడం కష్టం: పరిస్థితి అభివృద్ధి చెందుతున్నప్పుడు, మింగడం బాధాకరంగా మారుతుంది. ముఖ్యంగా గట్టి ఆహారాలు ఉంటే మరింత కష్టం. దీనివల్ల బరువు తగ్గుతారు.
Images source: google
నొప్పి, మంట: నోరు లేదా గొంతులో మండుతున్నట్టు అనిపిస్తుంటుంది. ఈ నొప్పి అసిడిక్ లేదా స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల మరింత తీవ్రం అవుతుంది.
Images source: google
జ్వరం: మ్యూకోసిటిస్ ఇన్‌ఫెక్షన్ ఉంటే జ్వరం కూడా రావచ్చు. ఈ సందర్భంలో, వైద్య సంరక్షణ అవసరం.
Images source: google
దుర్వాసన: పుండ్లు తీవ్రమవుతున్నప్పుడు, నోటిలో బ్యాక్టీరియా ఉండటం వల్ల నోటి దుర్వాసన ఎక్కువ అవుతుంది.
Images source: google