వందేభారత్ స్లీపర్ రైలు ప్రత్యేకతలు ఇవీ

Images source: google

దేశంలో వందే భారత్ రైళ్లు దూసుకుపోతున్నాయి. ఇవి ప్రారంభించినప్పటి నుంచే అనూహ్య స్పందన వస్తున్నాయి. వీటిల్లో ప్రయాణం చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.

Images source: google

రైల్వే శాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంంది. వందే భారత్ నుంచి స్లీపర్ రైళ్లను కూడా నడపాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇందు కోసం ఇప్పటికే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు.

Images source: google

  వంద్ భారత్ స్లీపర్ రైళ్లు ఎలా ఉండబోతున్నాయి? ఇవి ఎప్పుడు అందుబాటులోకి రానున్నాయి? వాటి టికెట్ ధర ఎంత ఉండనుంది? అనే వివరాల్లోకి వెళితే..

Images source: google

  స్లీపర్ రైళ్లలో అదనంగా కొన్ని ప్రత్యేక సదుపాయాలు  ప్రవేశపెట్టినట్లు రైల్వే శాఖ నుంచి సమాచారం ఉంది. ఇందులో ప్రయాణికులకు సౌకర్య వంతంగా యూఎస్ బీ ఛార్జర్ ఉండనుంది.

Images source: google

ప్రయాణికుల రక్షణ కోసం సీసీ కెమెరాలు, విమానంలో లాగా ఇన్ సైడ్ డిస్ ప్లే,  సమాచారం తెలిపే విజువల్ బోర్డులు ఉండనున్నాయి. ఏసీ కోచ్ లో వేడి నీరుకూడా ఉండనుంది. దివ్యాంగుల కోసం ప్రత్యేక బెర్త్ లు అమరుస్తున్నారు.

Images source: google

ఇప్పుడున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు గంటకు 160 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్నాయి. అయితే కొత్తగా రాబోతున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నాయి.

Images source: google

రైల్వే సమాచారం మేరకు ఇప్పుడున్న ఎక్స్ ప్రెస్ ధరలకు సమానంగానే స్లీపర్ ధరలు కూడా ఉంటాయని తెలుస్తోంది. మొత్తం 16 కోచ్ లు ఉంటాయి. వీటిలో 1 ఫస్ట్ క్లాస్,  2ఏసీ కోచ్ లు 4, 3ఏసీ కోచ్ లు 11 ఉండనున్నాయి.

Images source: google

 డిసెంబర్ లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా ప్రారంభించే వందే భారత్ స్లీపర్ రైలు బెంగుళూరు, ఢిల్లీ, ముంబయ్ రూట్లలో ప్రారంభించే అవకాశం ఉంది.   ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇందులో అదనపు సౌకర్యాలు అమర్చనున్నారు.

Images source: google