Images source: google
ప్రపంచంలో రష్యా 17.1 మిలియన్ చదరపు కి.మీ విస్తీర్ణంతో అతిపెద్ద దేశం. ఇక వాటికన్ సిటీ 0.49 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ప్రపంచంలో విస్తీర్ణం పరంగా పెద్ద నగరాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం..
Images source: google
లా టుక్ : లా టుక్ నగరం విస్తీర్ణం పరంగా ప్రపంచంలో రెండో దేశమైన కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో ఉంది. ఇది 28,122 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిం ఉంది. ఈ నగరం నదులు, సరస్సులు, వృక్ష సంపదతో అందంగా ఉంటుంది.
Images source: google
షాంఘై: ప్రపంచంలో రెండో అతిపెద్ద నగరం షాంఘై. ఇది చైనాలో ఉంది. దీని మొత్తం వైశాల్యం 6,541 చదరపు కిలోమీటర్లు. ఇది ముఖ్యమైన ఓడరేవు నగరం. అంతర్జాతీయ ఫైనాన్స్ కేంద్రం.
Images source: google
ఇస్తాంబుల్ :ఇస్తాంబుల్ నగరం... టర్కీలో ఉంది. దీని వైశాల్యం 5,343 చదరపు కిలోమీటర్లు. ఇది ఒక ఖండాంతర నగరం. అందమైన వాస్తు శిల్పకళకు ప్రసిద్ధి చెందింది.
Images source: google
కరాచీ : కరాచీ నగరం పాకిస్తాన్‌లో ఉంది. దీని వైశాల్యం 3,527 చదరపు కిలోమీటర్లు. ఇది ఐకానిక్ సైట్‌లు, స్ట్రీట్ మార్కెట్‌లకు ప్రసిద్ధి చెందినది.
Images source: google
మాస్కో : ఇది ప్రపంచంలో అతిపెద్ద దేశమైన రష్యాలో ఉంది. దీని విస్తీర్ణం 2,561 చదరపు కిలోమీటర్లు. రెడ్ స్వేక్, క్రెమ్లిన్, సెయింట్ బాసిల్ కేథడ్రల్ వంటివి ఇక్కడ ప్రసిద్ధమైనవి.
Images source: google
టోక్కో : ఇది జపాన్ దేశ రాజధాని నగరం. దీని వైశాల్యం 2,188 చదరపు కిలోమీటర్లు. ఇది భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశం.
Images source: google