Images source: google
ఎర్ర ద్రాక్ష : కిడ్నీలను డీటాక్స్ చేయడంలో ఎర్ర ద్రాక్ష ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్లేవనాయిడ్లు కిడ్నీలను బాగు చేయడంలో సాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో కిడ్నీల లోపలనుంచి శుభ్రం చేస్తాయి.
Images source: google
ఎర్ర ద్రాక్షలు రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా దోహదపడతాయి. అందుకే ఎర్ర ద్రాక్షను తినడం ఎంతో మంచిది.
Images source: google
స్టాబెర్రీలు: స్ట్రాబర్రీలు కూడా మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లెటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం వల్ల కిడ్నీల పనితీరును సరి చేస్తాయి. కణాల్లో ఆక్సీకరణ ఒత్తిడి వాపు రాకుండా చేస్తాయి.
Images source: google
పుచ్చకాయ: పుచ్చకాయ కిడ్నీల చెడిపోయే ప్రమాదం నుంచి రక్షించేందుకు సాయపడుతుంది. ఇందులో ఉండే లైకోపీస్ సమ్మేళనం కిడ్నీల్లో మంటను చంపుతుంది. కిడ్నీలో పాస్పేట్ ఆక్సలేట్ సిట్రేట్ మరియు కాల్సియంలను సమతుల్యం చేస్తుంది.
Images source: google
నారింజ: నిమ్మజాతికి చెందిన ఆరెంజ్ పండ్లు తినడం వల్ల కూడా కిడ్నీలను శుభ్రపరుస్తుంది. కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఈ పండ్ల రసం రక్షిస్తుంది. శరీరంలో ఉండే ద్రవాలను సమతుల్యం చేస్తాయి.
Images source: google
దానిమ్మ : దానిమ్మ కూడా మూత్రపిండాలను శుభ్రం చేయడంలో దోహదపడుతుంది. కిడ్నీలు చెడిపోకుండా కాపాడటంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. కిడ్నీలో ఉండే పాస్పేట్, ఆక్సలేట్, సిట్రేట్ మరియు కాల్షియంల పనితీరును మెరుగుపరుస్తాయి.
Images source: google
ఈ పండ్లు తింటే కిడ్నీలు డ్యామేజ్ కాకుండా నిరోధించడంలో సాయపడతాయి. మూత్రపిండాలకు ప్రమాదం రాకుండా కాపాడతాయి.
Images source: google