Images source: google
రాక్ క్లైంబింగ్ చేయాలంటే చాలా పట్టుదల ఉండాలి. ఈ ఉత్కంఠభరితమైన జర్నీ అధిరోహకులను వారి నైపుణ్యాలపై మాత్రమే ఆధారపడుతూ ఎత్తులను జయించేలా చేస్తుంది. అవుట్‌డోర్ రాక్ క్లైంబింగ్ ను ఇక్కడ ఆస్వాదించండి.
Images source: google
పశ్చిమ కనుమలలో ఉన్న మల్షేజ్ ఘాట్, రాక్ క్లైంబింగ్ నేర్చుకోవడానికి దేశంలోని అత్యుత్తమ ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ, అనేక కొండలు, బండరాళ్లు అన్ని స్థాయిల అధిరోహకులను సవాలు చేస్తుంటాయి.
Images source: google
హంపి, అనేక దేవాలయాలు, కోటలు, పురాతన స్మారక చిహ్నాలకు నిలయంగా ఉండటమే కాకుండా, రాక్ క్లైంబింగ్‌కు వెళ్లేందుకు ఎన్నో ప్రదేశాలను కలిగి ఉంది.
Images source: google
షే రాక్ ప్రాంతం లడఖ్‌లోని ఒక ప్రసిద్ధ రాక్ క్లైంబింగ్ స్పాట్, ఇది వివిధ రాతి నిర్మాణాలతో నిండి ఉంటుంది. ఇది ప్రారంభం చేయాలి అనుకునేవారికి అనువైన ప్రదేశం.
Images source: google
హిమాచల్ ప్రదేశ్‌లోని మియార్ వ్యాలీ రాక్‌క్లైంబింగ్‌కు గొప్ప ప్రదేశం. ఈ ప్రదేశం అందమైన అడవులు, నిర్మలమైన నదులు, మంచుతో కూడుకొని ఒక సూపర్ థ్రిల్ ను అందిస్తుంది.
Images source: google
పర్వతారోహణకు ప్రసిద్ధి చెందిన హిమాచల్ ప్రదేశ్‌లోని పార్వతి లోయ, పెద్ద రాతి నిర్మాణాలకు నిలయం.
Images source: google
భారతదేశంలోని ఉత్తమ పర్వతారోహణ ప్రదేశాలలో కర్ణాటకలోని బాదామి ఒకటి. ఈ గమ్యస్థానం అధిరోహకులకు సరైన బోల్ట్ మార్గాలను కలిగి ఉంది. దీనిని మక్కా ఆఫ్ రాక్ క్లైంబింగ్ అని పిలుస్తారు.
Images source: google
కర్ణాటకలోని సావన్‌దుర్గ కొండ ఆసియాలోని అతిపెద్ద ఏకశిలా కొండలలో ఒకటి. ఇక్కడ, ప్రత్యేక క్లైంబింగ్, రాపెల్లింగ్ మార్గాలు ఉన్నాయి.
Images source: google
కర్ణాటకలోని రామనగర బ్లాక్ బస్టర్ మూవీ ‘షోలే’ ద్వారా పాపులర్ అయింది. ఒకప్పుడు గబ్బర్ దాక్కున్న రాళ్లు ఇప్పుడు గొప్ప రాక్‌క్లైంబింగ్ అవకాశాలను అందిస్తున్నాయి.
Images source: google