వయస్సు: మీకు ఎంత వయసు అనే వివరాలు ఎవరికి చెప్పకూడదట. వయసు చెప్పడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అంటారు జ్యోతిష్యులు.

ధనం: మీ వద్ద ఎంత ధనం ఉంది? ఎంత సంపాదించారు? ఇంతకీ ఉందా లేదా అనే వివరాలు ఎవరికి చెప్పకూడదు. దీని వల్లనే ఇతరుల ప్రవర్తన ఉంటుంది. కాబట్టి దీని వివరాలు కూడా తెలియజేయకండి.

ఇంటి గుట్టు: ఎల్లవేళలా ప్రతి ఒక్కరు ఒక విధంగా ఉంటారు అనుకోకూడదు. బాగున్నప్పుడు మీ ఇంటి గుట్లు చెబితే ఆ తర్వాత ఇబ్బందుల్లో పడేది మీరు అని గుర్తు పెట్టుకోండి.

శృంగారం: మీ భాగస్వామితో శృంగార జీవితం ఎలా ఉందో కూడా చెప్పకూడదు. ఇలాంటి విషయాలు మీ ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి అని గుర్తు పెట్టుకోండి.

దానం: మీరు చేసే దానాలు కూడా ఎవరికి తెలియకూడదు. ఎడమ చేతితో చేసిన దానం కుడి చేతికి తెలియకూడదు అంటారు. అలా ఉండాలి.

అవమానం: మీకు జరిగిన అవమానాల గురించి కూడా ఇతరులకు చెప్పకండి. ఇవి మీతోనే అంతం అవ్వాలి. లేదంటే మరింత అవమానం చేయడానికి రెడీ ఉంటారు కొందరు.

మానం: మీ శరీరం విషయంలో కూడా జాగ్రత్త పడాలి. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ లు, స్కైప్, వీడియో కాల్ అంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త

Off-white Banner

Thanks For Reading...