మీకు ఎప్పుడైనా రైలు లో ప్రయాణిస్తున్నప్పుడు ఇబ్బందులు వచ్చాయా? కానీ ఎలా ఫిర్యాదు చేయాలో అర్థం కాలేదా? అయితే ఫిర్యాదును నమోదు చేయడానికి రైల్వే శాఖ టోల్ ఫ్రీ నంబర్ ను మీకు కోసం అందుబాటులోకి తెచ్చింది.
Images source: google
'రైల్ మదద్' పేరుతో హెల్ప్ లైన్ నంబర్ 139ను ప్రయాణీకులకు అందుబాటులో ఉంచింది. దీనికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాదు ఎస్ఎమ్ఎస్ పంపే సదుపాయం కూడా ఉంది.
Images source: google
రైలు ప్రమాదాలు, ఏదైనా ఇతర రైలు సంబంధిత, భద్రత, వైద్య అత్యవసర పరిస్థితులు, సాధారణ ఫిర్యాదులతో పాటు విజిలెన్స్ వంటి వాటిపైనా సమాచారం ఇవ్వవచ్చు.
Images source: google
ఈ టోల్ ఫ్రీ నంబర్ పై ఫిర్యాదు చేసిన అంశంపై స్టేటస్ తెలుసుకునే సదుపాయం కూడా ఉంది.
Images source: google
భద్రత, అత్యవసర వైద్య సేవల కోసం 1 నొక్కండి. ఇలా చేస్తే నేరుగా ఎగ్జిక్యూటివ్ కాల్ సెంటర్ కు మీ కాల్ కనెక్ట్ అవుతుంది.
Images source: google
రైలు ఎంక్వైరీల కోసం 2 నొక్కితే సరిపోతుంది. ఇందులో సబ్ మెనూలో పీఎన్ఆర్ స్టేటస్, రైలు రాకపోకల సమాచారం అందుతుంది.
Images source: google
టిక్కెట్ బుకింగ్, వీల్ చైర్ బుకింగ్, రద్దు, ఛార్జీల విచారణ, వేకప్ అలారం, గమ్యస్థాన హెచ్చరిక, భోజనం బుకింగ్ కోసం సబ్ మెనూలో ఉన్న 2 నొక్కి మీరు సేవలను వినియోగించుకోవచ్చు.
Images source: google
విజిలెన్స్ సంబంధిత సమస్యల కోసం 5 నొక్కితే మీ సమస్య తీరుతుంది. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడేందుకు స్టార్ (*) బటన్ నొక్కండి.
Images source: google