ప్లేమింగ్.. అంటే మండతున్న అర్థం.. పేరుకు తగినట్లుగా.. వాయవ్య చైనాలోని ఫ్లేమింగ్ పర్వతాల్లో 75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Images source: google
అంత వేడిలో కూడా అక్కడికి వచ్చిన పార్యటకులు ఎంజాయ్ చేస్తారు. తీవ్ర ఎండలోనూ ఇసుకలో కాల్చిన గుడ్లను తింటారు. కొందరు ఐస్‌క్రీం తింటూ ఎంజాయ్ చేస్తారు.
Images source: google
వాయవ్య చైనాలోని జిన్‌జియాంగ్‌లో ఉన్న తుప్పాన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఫ్లేమింగ్ పర్వతాలు. ఈ పర్వతాలపై పేరుకు తగినట్లుగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
Images source: google
మంగళవారం(జూన్ 11న) రికార్డు స్థాయిలో 75 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. భూమి నుంచి వేడివేడి పొగలు వసున్నప్పటికీ అక్కడికి పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
Images source: google
ఇక పార్యటకులు ఎండ వేడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి టోపీలు ధరించారు. గొడుగులు పట్టుకున్నారు. ఇక పర్వతాలపై ఏర్పాటు చేసిన 12 మీటర్ల థర్మామీటర్ స్తంభంలో ఉష్ణోగ్రత 75 డిగ్రీ సెల్సియస్ నమోదైన దృశ్యాన్ని పర్యాటకులు గమనించారు.
Images source: google
ఇక ఫ్లేమింగ్ పర్యవతాలపై ఉంటే.. మండుతున్న కొలిమిలో ఉన్నట్లు ఉందని ఓ పర్యాటకుడు తెలిపాడు. ఇలాంటి వాతావరణం మునుపెన్నడూ చూడలేదని పేర్కొన్నాడు. ఇది మరుపురాని అనుభూతి అని తెలిపారు.
Images source: google
యాత్రికుల రక్షణ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నాడు. కూలింగ్ ఫ్యాన్లు, ఐస్ కూలర్లు ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
Images source: google
ఇక పర్వతం పరిసర ప్రాంతాల్లో వేడి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగానే నమోదయ్యాయని పర్యాటక ప్రాంత నిర్వాహకులు తెలిపారు. ఇంత వేడిలోనూ పర్యాటకులు రావడం ఆనందంగా ఉందటున్నారు.
Images source: google