పార్టీ ఒకే కానీ చెత్త క్లీన్? నో టెన్షన్ జస్ట్ సింపుల్..

పార్టీ తర్వాత, చాలా చెత్త చేరుకుంటుంది. ప్లేట్లు, గ్లాసులు, పేపర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెత్తనే ఉంటుంది.

కానీ మీరు కొన్ని టిప్స్ పాటిస్తే మీ పని చాలా సులభం అవుతుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటంటే..?

డిస్పోజబుల్ ప్లేట్లు: డిస్పోజబుల్ ప్లేట్ల వల్ల మీకు వాషింగ్ సమస్య ఉండదు. సో స్టీల్ వాటికంటే డిస్పోజబుల్ వి ఉపయోగించండి.

చెత్త డబ్బాలు: వచ్చిన వాల్లు డస్ట్ బిన్ కనిపించకపోవడంతో ఎక్కడంటే అక్కడ చెత్త పడేస్తారు. అందుకే మీరు డస్ట్ బిన్ పెట్టండి. దీని వల్ల శుభ్రపరచడం సులభతరం అవుతుంది.

 సీసాల కోసం క్రేట్: మీ పార్టీలో పానీయాలు ఉంటే, ఖాళీ సీసాల కోసం ఒక క్రేట్ సిద్ధంగా ఉంచుకోండి. దీని వల్ల సమస్య సాల్వ్ అవుతుంది.

జిడ్డు పాత్రలు: జిడ్డు పాత్రలు, ఎండిన పాత్రలు ఉంటే ముందుగానే నానబెట్టేసేయండి. మీరు కడిగేటప్పుడు చాలా సింపుల్ అవుతుంది.

 మిడ్-పార్టీ క్లీన్: కప్పులు, ప్లేట్లు, బాటిళ్లను క్లియర్ చేయడానికి పార్టీ మధ్యలోనే కొన్ని నిమిషాలు కేటాయించండి. దీనివల్ల పార్టీ తర్వాత పెద్దగా టెన్షన్ ఉండదు.

సహాయం: క్లీనప్‌లో పాల్గొనడానికి కొంతమంది స్నేహితులను  లేదా కుటుంబ సభ్యుల సహాయం పొందండి. ఇది మీ పనిభారం తగ్గుతుంది. పని స్పీడ్ అవుతుంది.