https://oktelugu.com/

ప్రపంచంలోని 10 అత్యంత ప్రమాదకరమైన దేశాలు

ఆఫ్ఘనిస్తాన్ : ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత కారణంగా ఆఫ్ఘనిస్థాన్  ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా కొనసాగుతోంది.

Image Credit : google

ఐక్యరాజ్యసమితి ప్రకారం, సంవత్సరాల సైనిక సంఘర్షణ, హింస కారణంగా యెమెన్ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభంలో మునిగిపోయింది.

Image Credit : google

కొనసాగుతున్న అంతర్యుద్ధం, తీవ్రవాద కార్యకలాపాలు, తీవ్ర హింసలు సిరియాను ప్రమాదకరమైన దేశంగా చూపిస్తున్నాయి.

Image Credit : google

సుదీర్ఘ అంతర్గత సంఘర్షణ, జాతి హింస, అస్థిరతలు దక్షిణ సూడాన్‌ను చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా మార్చాయి.

Image Credit : google

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో పేదరికం, రాజకీయ అశాంతి ఉంటుంది. హత్యలు, అత్యాచారం, కిడ్నాప్‌లు, కార్‌జాకింగ్‌లు, దొంగతనాలు, హైవే దోపిడీలు ఇక్కడ సర్వసాధారణంగా జరుగుతుంటాయి.

Image Credit : google

రస్సో-ఉక్రేనియన్ యుద్ధంలో పాల్గొన్న రెండు దేశాలలో రష్యా మరింత ప్రమాదకరమైనదిగా ర్యాంక్ పొందింది. ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం ప్రాణనష్టం వల్ల రష్యా ప్రమాద దేశంగా తేలింది.

Image Credit : google

 ఉక్రెయిన్ కూడా ప్రమాదకర దేశంగా కొనసాగుతుంది.  ప్రధానంగా ఫిబ్రవరి 2022లో రష్యాతో యుద్దానికి దిగడం వల్ల భయం లేని దేశంగా కూడా పేరు సంపాదించింది.

Image Credit : google

 సోమాలియా సముద్రపు దొంగల సమస్యకు సోమాలి బేసిన్‌లో ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్రమైన పరిణామాలను కలిగి ఉన్న వ్యాపారి నౌకలపై అక్రమ దాడులు కూడా ఇక్కడ జరుగుతుంటాయి.

Image Credit : google

గతంతో పోలిస్తే హింస తగ్గినప్పటికీ, ఇరాక్‌లో తీవ్రవాదం, మతపరమైన హింస, రాజకీయ అస్థిరత ఇప్పటికీ గణనీయమైన ప్రమాదాలను కలిగి ఉన్నాయి.

Image Credit : google