రాత్రి తీసుకునే భోజనం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఈ సమయంలో లైట్ ఫుడ్ ను మాత్రమే ఎంచుకోవాలి.

రాత్రి 8 గం. ల లోపు మాత్రమే భోజనం చేయాలి. లేదంటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందట.

డిన్నర్ లో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుంటే కొలెస్ట్రాల్ పెరగదు.

వ్యాయామం ఉదయం మాత్రమే కాదు సాయంత్రం కూడా చేయవచ్చు. కానీ తేలిక పాటి వ్యాయామం మాత్రమే చేయాలి.

గుండె సమస్యలు పెరగడానికి ఒత్తిడి కూడా కారణం కాబట్టి యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి.

శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. రాత్రి నీరు తాగితే బాత్రూమ్ కు వెళ్లాలి అని కొందరు తాగరు. కానీ ఇది చాలా పెద్ద తప్పు.

అన్నింటి కంటే ముఖ్యమైనది నిద్ర. అందరికీ కచ్చితంగా 8 నుంచి 9 గంటల నిద్ర అవసరం. కాబట్టి జాగ్రత్త.

Off-white Banner

Thanks For Reading...