దేవుళ్లకు సంబంధించిన సినిమాలు చేస్తున్నప్పుడు హీరోలు నాన్ వెజ్ కూడా తినరట. మరి సినిమాల కోసం నాన్ వెజ్ ను వదిలేసిన వారు ఎవరో ఓ సారి చూసేద్దాం.

Images source: google

సీనియర్ ఎన్టీఆర్: దేవుళ్ల పాత్రలో నటించాలంటే ఒకప్పుడు అందరి ఛాయిస్ సీనియర్ ఎన్టీఆర్. ఈయన కెరీర్ లో చాలా పౌరాణిక పాత్రలు చేశారు. ఈయన నటించిన ఇలాంటి సినిమాల షూటింగ్స్ ప్రారంభం అయితే పూర్తయ్యేవరకు కూడా నాన్ వెజ్ తినేవారు కాదట.

Images source: google

నాగార్జున: షిరిడి సాయి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో సాయి బాబ పాత్రలో నటించారు నాగార్జున. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి అయ్యేవరకు ఎలాంటి మాంసాహారం తీసుకోలేదట నాగార్జున.

Images source: google

అల్లు అర్జున్: హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. ఈ మూవీలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడిగా నటించారు. బ్రాహ్మణులు నాన్ వెజ్ తినరని.. ఆ క్యారెక్టర్ లో నటించిన సమయంలో అల్లు అర్జున్ నాన్ వెజ్ తినలేదట.

Images source: google

పవన్ కళ్యాణ్: సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తారు. దీంతో సినిమా పూర్తయ్యేవరకు పవన్ కళ్యాణ్ నాన్ వెజ్ తినలేదట.

Images source: google

రిషబ్ శెట్టి: కాంతార సినిమా సంచలన విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.   సినిమాలో కోలా సీక్వెన్స్ సినిమా కోసం హీరో రిషబ్ శెట్టి 20 నుంచి 30 రోజులు నాన్ వెజ్ తినలేదట.

Images source: google

అక్షయ కుమార్: ఓ మై గాడ్ సినిమా చేస్తున్నప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా నాన్ వెజ్ తినడం లేదట. ఇందులో కృష్ణుడి పాత్రలో నటిస్తున్నారు అక్షయ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ వెజ్ తినవద్దని చెప్పారట అక్షయ్ తల్లి.  

Images source: google

పరిణీతి చోప్రా: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా గురించి పరిచయం అవసరం లేదు.  ‘కోడ్ నేమ్ తిరంగ’ అనే మూవీలో నటించినప్పుడు ఆమె నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్నారట.

Images source: google

మరి చూశారుగా కేవలం సినిమాలే అని వదిలేయకుండా దైవ భక్తితో ఈ స్టార్ హీరోలు, పరిణీతి చోప్రా నాన్ వెజ్ కు దూరంగా ఉన్నారు. అలాంటిది సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు నాన్ వెజ్ తినలేదంటే గ్రేట్ కదా..

Images source: google