అవిసె గింజలని పోషకాల గని.. ఇందులో ఉండే ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వీటిని రాత్రి నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
Images source: google
పరగడుపున తినడం వల్ల కడుపు ఖాళీ అవుతుంది. అలాగే పేగు సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. ఇందులో ఉండే ఫైబర్, లిగ్నన్స్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
Images source: google
అవిసె గింజల వల్ల అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. రోజూ ఉదయం లేదా సాయంత్రం నానబెట్టిన ఫ్లాక్స్ సీడ్ వాటర్ తాగడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు బలంగా కూడా ఉంది.
Images source: google
ఇందులో ఉండే విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
Images source: google
నానబెట్టిన అవిసె గింజలను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది. రాత్రంతా నీటిలో అవిసె గింజలను నానబెట్టి ఉంచితే కాస్త ఉబ్బుతాయి.
Images source: google
ఉదయాన్నే తినడం వల్ల కడుపు నిండుతుంది. దీంతో చిరు తిండ్లు వంటివి తినకుండా ఉంటారు. దీనివల్ల బరువు తగ్గుతారు. అవిసె గింజలు అధిక రక్తపోటును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
Images source: google
ఈ గింజల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకి కూడా అవిసె గింజలు బాగా పని చేస్తాయి. వీటిని కాస్త వేయించి తిన్నా కూడా మధుమేహం తగ్గుతుంది.
Images source: google
అలాగే ప్రమాదకర వ్యాధులు రాకుండా అవిసె గింజలు కాపాడతాయి. వీటిని డైరెక్ట్ గా తీసుకోవడం నచ్చకపోతే.. మొలకలు లేదా పొడి చేసుకుని కూడా వాడవచ్చు.
Images source: google