https://oktelugu.com/

ముడతలు వస్తున్నాయా? అయితే ఈ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

Images source: google

చక్కెర: చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాల వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు.ఇలాంటి ఆహారాల వల్ల రక్తంలో షుగర్‌ పెరుగి.. కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో ముడతల సమస్యల వస్తుంది.

Images source: google

కాఫీ: రోజుకు ఒక కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది కానీ మోతాదుకు మించి కాఫీలు తాగితే చర్మం డీ హైడ్రేట్‌ అవుతుంది. దీంతో మొటిమలు, ముడతలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

ఫ్రైడ్‌ఫుడ్స్‌: ఫ్రైడ్‌ఫుడ్స్‌లో నూనె కంటెంట్ ఎక్కువ. ఇందులో ట్రాన్స్ ఫ్యాట్‌ కూడ ఎక్కువే. దీనివల్ల కొల్లాజెన్‌ ఉత్పత్తి దెబ్బతింటుంది. ఫలితంగా ముడతలు వస్తాయి.

Images source: google

స్పైసీ ఫుడ్‌: స్పైసీ ఫుడ్‌ వల్ల చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతేకాదు సున్నితమైన చర్మం తీవ్రంగా దెబ్బతింటుంది.

Images source: google

ఉప్పు ఆహారాలు: ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు కూడా తీసుకోవద్దు. వీటిని తింటే శరీరంలో వాటర్‌ ఎక్కువ అవుతుంది. ఇది చర్మం ఉబ్బినట్లు కనబడటానికి కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు.

Images source: google

ఆల్కాహాల్‌: ఆల్కాహాల్ తాగితే ఆరోగ్యానికి హానికరం అని తెలిసిందే. ఎక్కువగా మద్యం సేవిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా చర్మంపై ముడతలు, ఎరుపుదనం వస్తుంది.

Images source: google

ప్రాసెస్‌ ఆహారం, డెయిరీ ఉత్పత్తులు:  ప్రాసెస్‌ చేసిన ఆహారాలోని ఆర్టిఫిషియల్‌ ఫ్లేవర్స్‌ చర్మ సమస్యలకు కారణం అవుతాయి. డెయిరీ ఉత్పత్తుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీంతో చర్మ సౌందర్యం దెబ్బతింటుంది.

Images source: google