Images source: google
జింబాబ్వే కెప్టెన్, స్టార్ బ్యాటర్ టి 20 క్రికెట్ లో సంచలన ఇన్నింగ్స్ ఆడి సరికొత్త రికార్డులు సృష్టించాడు.
Images source: google
ఐసీసీ టీ20 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫైయర్ పోటీలో గాంబియా జట్టుపై విధ్వంసకర ఆటతీరు ప్రదర్శించి సరికొత్త ఘనతను అందుకున్నాడు.
Images source: google
సికిందర్ రజా 43 బంతుల్లో 133 పరుగులు చేశాడు. ఫలితంగా జింబాబ్వే 20 ఓవర్లలో 344 పరుగులు చేసింది.
Images source: google
సూపర్ సెంచరీ ద్వారా సికిందర్ రజా టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ని అధిగమించాడు.
Images source: google
33 బంతుల్లోనే రజా సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్ ఆడే జట్టుకు చెందిన ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ.
Images source: google
గతంలో రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో సెంచరీ చేసి సంయుక్తంగా రికార్డును సృష్టించారు.
Images source: google
టి20 క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల విభాగంలోనూ సికిందర్ రజా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు.
Images source: google
విరాట్ కోహ్లీ టి20 క్రికెట్లో 16 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు. సికిందర్ రజా 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో సరికొత్త రికార్డు సృష్టించాడు.
Images source: google