https://oktelugu.com/

లవ్ ప్రస్తుతం కామన్. కొన్ని సార్లు అట్రాక్షన్ ను కూడా లవ్ అనుకుంటున్నారు. అయితే ఏ రిలేషన్ అయినా సరే పులిస్టాప్ పెట్టాలి అని కొన్ని సంకేతాలు మీకు చెబుతుంటాయి. అవేంటంటే..

Images source: google

గొడవలు జరగడం కామన్. కానీ ఒకే విషయానికి సంబంధించి ప్రతి సారి పదే పదే గొడవ జరుగుతుంటే మీరు ఆలోచించాల్సిందే. ఒక ముఖ్యమైన పని గురించి చెప్పినప్పుడు దానికి భిన్నంగా వారు చేస్తుంటే మీరు ఆలోచించాలి.

Images source: google

మీ పార్టనర్ చెప్పిన విషయాల పట్ల మీకు అసలు ఆసక్తి లేకపోయినా, ఆ విషయాలు మీకు నచ్చకపోయినా పదే పదే మీతో చేయిస్తున్నా సరే మీరు విసిగిపోతున్నారని అర్థం.

Images source: google

ఏ రిలేషన్ లో అయినా నమ్మకం చాలా ముఖ్యం. నమ్మకం లేని ఏ బంధం నిలబడదు. మీ ఇద్దరి మధ్యలో నమ్మకానికి ఆస్కారం లేదంటే ఇక మీరు ఆ రిలేషన్ ను లైట్ తీసుకోవడం బెటర్.

Images source: google

మంచి సమయం ఇద్దరు కలిసి స్పెండ్ చేస్తున్నారా? నాణ్యమైన సమయం కంటే ఎక్కువగా గొడవలే జరుగుతున్నాయి అంటే ఇక మీ రిలేషన్ కు పులిస్టాప్ పెట్టాల్సిందే.

Images source: google

ఒకరి లక్ష్యాన్ని మరొకరు గౌరవించాలి. మీ లక్ష్యాన్ని తను గౌరవించకపోయినా చులకనగా చూసిన మీ మీద రెస్పెక్ట్ లేనట్టే.

Images source: google

మిమ్మల్ని మీ శక్తిని లెక్క చేయకపోయినా, మీకు గౌరవం ఇవ్వకపోయినా కాస్త ఆలోచించండి.

Images source: google

పెళ్లికి ముందే మీ రిలేషన్ చాలా దారుణంగా ఉంటే ఆ తర్వాత గురించి ఆలోచించాలి.  మీ సంబంధంలో ప్రేమ, అభిమానం లేకుండా పగ, కోపం ఉంటే థింక్ వన్స్.

Images source: google