Images source: google
గోల్డ్ లోన్‌లో తీసుకోవాలంటే మీ ఆభరణాలు బ్యాంకులో పెట్టాల్సిందే. కానీ పర్సనల్ లోన్ కు ఏవి అవసరం లేదు. నగలు పోతాయనే భయమే ఉండదు. కానీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది జాగ్రత్త.
Images source: google
గోల్డ్ లోన్ తీసుకుంటే ఆభరణాలను తనిఖీ చేస్తారు. ఒకే అనుకుంటే రుణం ఇస్తారు. కానీ పర్సనల్ లోన్ లో కేవలం ఆదాయం, క్రెడిట్ స్కోర్, జాబ్ రికార్డ్ వంటివి మాత్రమే చూస్తారు.
Images source: google
ఆభరణాల విలువ ఆధారంగా 75% వరకు గోల్డ్ లోన్ లభిస్తుంది. కానీ పర్సనల్ లోన్ లో మాత్రం ఆదాయానికి అనుగుణంగా లోన్ వస్తుంది. కానీ EMI ఆదాయంలో 50% కంటే ఎక్కువ ఉండవద్దు.
Images source: google
ఈ పర్సనల్ లోన్ ను పెళ్లి, ప్రయాణం లేదా ఇతర ఖర్చుల కోసం ఉపయోగిస్తుంటారు. గోల్డ్ లోన్ మాత్రం అత్యవసరాలకు మాత్రం వినియోగిస్తుంటారు.
Images source: google
గోల్డ్ లోన్ లో గోల్డ్ పెట్టాలి కాబట్టి మీ వద్ద కచ్చితంగా గోల్డ్ ఉండాలి. అదే పర్సనల్ లో లోన్ లో ఏ గ్యారంటీ లేకుండా లోన్ పొందవచ్చు. ఇది కేవలం పేపర్ వర్క్ తో అవుతుంది.
Images source: google
పర్సనల్ లోన్ ను సరైన సమయానికి కట్టకపోతే మీ స్కోర్ దెబ్బతింటుంది. కానీ గోల్డ్ లోన్ కు ఇలాంటి సమస్య ఉండదు.
Images source: google
మీకు తక్కువ వడ్డీ రేటు, ఆభరణాలు కావాలంటే, బంగారు రుణం తీసుకోవడం బెటర్. గ్యారెంటీ లేకుండా డబ్బు కావాలంటే, పర్సనల్ లోన్ తీసుకోండి కానీ జాగ్రత్త.
Images source: google