https://oktelugu.com/

నువ్వులు తింటున్నారా? అయితే ఇది మీకోసమే..

నువ్వులలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంలు పుష్కలంగా లభిస్తాయి.

పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు  అదుపులో ఉంటాయి. అందుకే నువ్వులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచివి.

నువ్వులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నువ్వులలో ఉండే అధిక  కాల్షియమే దీనికి కారణం. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులతో పోరాడుతాయి  నువ్వులు.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.ఇందులోని పీచు అరుగుదలకు తోడ్పడుతుంది.  మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి నువ్వులు.

నువ్వులు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. నువ్వులలో ఉండే అనేక పోషకాలు  దీనికి సహాయం చేస్తాయి. నువ్వుల్లో ఉండే విటమిన్ బి6 మెదడుకు సహాయకారిని.

నువ్వులు మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. నువ్వులలోని విటమిన్-ఇ చర్మ వ్యాధులతో పోరాడి చర్మాన్ని రక్షిస్తాయి.

నువ్వులతో గుండె ఆరోగ్యంగా కూడా పదిలమే. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఎముకల బలంగా ఉంటాయి.  జాయింట్ పెయిన్స్‌, ఆస్టియోపోరోసిస్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి నువ్వులు.