https://oktelugu.com/

వియత్నాం దేశంలోని సా డెక్ ఫ్లవర్ విలేజ్లో ప్రతిదీ అద్భుతమే. ఈ దేశంలో మూడు స్టాండ్ లపై మొక్కలు పెంచుతున్నారు.

Image Source: Google

ఈ ప్రాంతం వానలు వస్తే మునిగిపోతుంది. ఆ సమస్యకు పరిష్కారంగా మూడు అడుగుల ఎత్తులో స్టాండ్లు ఏర్పాటు చేసి.. నీళ్లపై మొక్కలను పూల బొకెల్లా పెంచుతున్నారు.

Image Source: Google

వీటిని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తూ ఉంటారు. అక్కడ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు.

Image Source: Google

Image Source: Google

ఈ పూల స్టాండ్లను చూసేందుకు ప్రత్యేక పడవలు ఏర్పాటు చేస్తారు. ఆ ప్రత్యేక పడవల్లో పర్యాటకులు ఆ పూల మొక్కల్ని చూసి పరవశించిపోతారు.

ప్రతి ఏడాది ఈ పూల మొక్కలను చూసేందుకు 20 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తూ ఉంటారు. మన దేశం నుంచి కూడా పర్యాటకులు వెళ్తూ ఉంటారు.

Image Source: Google

ఐ సినిమాలో పూలనే కునుకేయమంట అనే పాటను ఈ ప్రాంతంలో చిత్రీకరించాలనుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ తర్వాత ఇదే కాన్సెప్ట్ తో వేరే ప్రాంతంలో పాట షూట్ చేశారు.

Image Source: Google

ఈ పూల ద్వారా సా డెక్ ఫ్లవర్ విలేజ్ వాసులు ప్రతి ఏడాది 20 కోట్ల దాకా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నారు.

Image Source: Google

ఇక్కడ పెరిగిన పూలను చైనా, భారత్, దక్షిణకొరియా, జపాన్, జర్మనీ, ఇటలీ, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

Image Source: Google