సమంత రుత్ ప్రభు.. విడాకులు తీసుకున్నాక మరింత స్టైలిష్ గా.. ధృడంగా కనిపిస్తోంది.

ఫ్యాషన్ కు ఐకాన్ గా మారుతోంది. తాజాగా వివాహ గౌనును స్టైలిష్ స్ట్రాప్‌లెస్ డ్రెస్‌గా మార్చడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది.

పెళ్లిలో వేసుకునే ఆ గౌను ఎప్పటికీ చిరస్మరణీయం. అందరూ దాచుకుంటారు. కానీ సమంత విడాకులు తీసుకోవడంతో ఆ గౌన్ ను పూర్తిగా మార్చేసింది.

సమంతా తన పెళ్లినాటి తెల్లని వివాహ గౌనును గదిలో దుమ్ము దూళిలో పడేయకుండా తన  డిజైనర్ స్నేహితురాలు క్రేషా బజాజ్‌తో కలిసి దానిని అద్భుతమైన బ్లాక్ కాక్‌టెయిల్ డ్రెస్‌గా మార్చేసింది.

సమంత ఒరిజినల్ వెడ్డింగ్ గౌన్ సెంటిమెంట్ ను..దాని విలువను గుర్తించందని చెప్పొచ్చు.

ఎందుకంటే ఆమె తన మాజీ భర్త నాగ చైతన్యతో క్రిస్టియన్ వివాహ వేడుకలో ఈ డ్రెస్ ను ఆమె ధరించింది.

వారి విడిపోయినప్పటికీ  సమంతా గౌనుకు జోడించిన జ్ఞాపకాలను గౌరవించాలని ఇలా మార్చింది.

ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Off-white Banner

Thanks For Reading...