గంజాయి.. ఈ మొక్కల పెంపకాన్ని మనదేశం నిషేధించింది. ఇందుకు కారణం ఈ ఆకుల్లో మత్తును కలిగించే ఆల్కలాయిడ్లు ఉంటాయి. ఇవి తీవ్రమైన మత్తును కలిగిస్తాయి.

Images source: google

గంజాయి ఆకులను మెత్తగా చేసుకుని తాగితే శరీరం వెంటనే మైకంలోకి వెళ్ళిపోతుంది. ఆ మైకంలో ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు.. పైగా అందులోనే వారు యూపోరియా (తాత్కాలికమైన విపరీత స్వర్గ సుఖం)ను అనుభవిస్తున్నట్టు భావిస్తారు.

Images source: google

గంజాయి కి బానిసలై చాలామంది అనేక రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం వీటి సాగుపై నిషేధం విధించింది.

Images source: google

 అయితే ఈ మొక్కలపై వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు కొద్దిరోజులుగా అధ్యయనాలు చేస్తున్నారు. అయితే ఇందులో అనేక రకాల ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి.

Images source: google

 గంజాయి మొక్కలో ప్రతి భాగాలు ప్రత్యేకమైనవే. కాండం, పుష్పం, ఆకులు, గింజలు, వేర్లు.. ఈ భాగాలను సైకో యాక్టివ్ అని పిలుస్తారు.

Images source: google

వీటినుంచి శాస్త్రవేత్తలు కన్నా బిజి రోల్(సీబీజీ) ని ఉత్పన్నం చేశారు.  34 మందిపై కన్నా బిజీ రోల్ ను ప్రయోగించారు. అయితే వారిలో ఆందోళన తగ్గిపోయింది. ఒత్తిడి తగ్గుముఖం పట్టింది. జ్ఞాపకశక్తి లో కాస్త మెరుగుదల కనిపించింది.

Images source: google

 అయితే గంజాయిని అదే పనిగా తాగితే శరీరంపై దుష్పరిణామాలను చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అవుతాయని హెచ్చరిస్తున్నారు.

Images source: google

శాస్త్రవేత్తలు పరిశోధనలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చినప్పటికీ.. గంజాయి వాడకం శరీరానికి ఏమాత్రం మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. దీన్ని ఓకేతెలుగు నిర్ధారించడం లేదు కేవలం అవగాహన కోసమే

Images source: google