కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుమల తిరుపతికి సమీపంలో ఏర్పేడు అనే మండలం ఉంది.. ఆ మండలంలో గుడిమల్లం అనే గ్రామం ఉంది.
Images source: google
ఇది తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేణిగుంట విమానాశ్రయం నుంచి పది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో అత్యంత పురాతనమైన శివలింగం ఉంది.
Images source: google
ఇక్కడ స్వామి వారు పరశు రామేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నారు..గుడిమల్లం ఆలయంలో శివలింగానికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. ఇక్కడి స్వామి వారి ఆలయంలోని గర్భాలయం, అంతరాలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది.
Images source: google
ఎందుకంటే ముఖ మండపాలకంటే ఇవి లోతులో ఉంటాయి.. ఇక్కడి శివలింగం లింగం రూపంలో కాకుండా మనిషి రూపంలో మహావీరుడిగా, వేటగాడిలాగా కనిపిస్తుంది.
Images source: google
ఈ ఆలయం క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో నిర్మించాలని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ కాలంలో శైవారాధన విశేషాంగా ఉందని ఇక్కడి ఆధారాలను బట్టి తెలుస్తుంది.
Images source: google
గుడిమల్లం ఆలయంలో పరుశురామేశ్వరుడి కి చోళులు, పల్లవులు, గంగ పల్లవులు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిత్యం ధూప దీప నైవేద్యాలు జరిగేవి.
Images source: google
ఈ ఆలయంలో ఉన్న శివలింగం.. ఉజ్జయిని ప్రాంతంలో దొరికిన రాగి నాణేల పై పోలి ఉందని.. మధురలోని మ్యూజియంలోనూ ఇలాంటి శిల్పం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఈ ఆలయం లోని ప్రధాన గది ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి వరదలు వస్తే పూర్తిగా మునిగిపోతుంది
Images source: google
ఆలయంలో ఒక చిన్న భూగర్భ తొట్టి, దానికి పక్కనే ఉన్న ఒక వాహిక శివలింగం వెంట కనిపిస్తుంది. వరద నీరు గనుక చుట్టుముట్టితే దానిద్వారా నీరు కిందకి ప్రవహిస్తుంది. కొద్ది రోజులకు ఆ భూగర్భ ట్యాంకు పూర్తిగా ఎండిపోతుంది.
Images source: google
ఇక ఈ ఆలయానికి ఉపయోగించిన శిల భూమ్మీద ఎక్కడా లేదని.. అంతరిక్షంలో లభించే ఒక రకమైన రాయి.. అంటే ఈ గుడి నిర్మాణం వెనుక కూడా చాలా చరిత్ర దాగి ఉందని వివరిస్తున్నారు..
Images source: google