https://oktelugu.com/

బలంగా ఉండాలంటే వృద్ధులు ఇలా చేయాల్సిందే..

వృద్ధులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారు కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇక కొన్ని కొన్ని వ్యాయామాలు కూడా వారిని ఆనందంగా ఉంచుతాయి. అవేంటంటే..

కుర్చీ స్క్వాట్స్: ముందు కుర్చీల సపోర్ట్ లతో వ్యాయామం చేసి కుర్చీ లేకుండా చేయడం వల్ల కాళ్లు బలంగా మారుతుంటాయి

వాల్ పుష్-అప్స్: ఛాతీ, భుజాలు, చేతులను బలపరిచే సున్నితమైన  వ్యాయామం ఇది.

లెగ్ లిఫ్ట్‌లు: కూర్చున్నప్పుడు కాళ్లను పైకి లేపడం, తొడలు, తుంటిపై దృష్టి పెట్టడం ద్వారా శరీరం బలంగా మారుతుంది.

టో స్టాండ్స్: కాలి వేళ్ళపైకి పైకి లేచి, వెనక్కి తగ్గించడం ద్వారా బ్యాలెన్స్ చేసుకోవడం మీద పట్ట పెరుగుతుంది.

బైసెప్ కర్ల్స్: పై చేతులను బలోపేతం చేయడానికి తక్కువ బరువులు లేదా రెసిస్టెన్స్ బ్యాండ్‌లను ఉపయోగిస్తుంది.

ప్లేస్‌లో మార్చింగ్: మోకాళ్లను ఎత్తుగా పైకి లేపడం ద్వారా కార్డియోవాస్కులర్ ఆరోగ్యం, కాలు బలం పెరుగుతుంది.

ఓవర్ హెడ్ ఆర్మ్ రైసెస్: బరువులు పట్టుకుని చేతులను పైకి లేపడం వల్ల భుజాలు బలంగా మారుతుంటాయి.