https://oktelugu.com/

ఆవాల మొక్కతో ప్రయోజనాలే కాదు.. పెంచడం కూడా సులభమే.. ఎలాగంటే..

ప్రతి వంటకంలో ఆవాలను కచ్చితంగా వేస్తారు. ఏ కూరలో అయినా ఇవి ఉండాల్సిందే. ఇక పప్పులో అయితే మరీ ముఖ్యం.

ఇంటి ముందు పెరట్లో ఆవాలు మొలుస్తుంటాయి. అయితే ఈ ఆవాల మొక్కతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.

ఈ మొక్క ఎర్ర మట్టిలో, ఇసుకలో సులభంగా పెరుగుతుంది. సో దీని కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.

కుండీలో పెంచినా కూడా ఈ మొక్క త్వరగా పెరుగుతుంది. సో ఎక్కడ అయినా సరే దీన్ని పెంచుకోవచ్చు.

ఈ మొక్కతో ఆవాలు మాత్రమే కాదు. దీని ఆకులను కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇసుకలో లేదా మట్టిలో ఓ 20 ఆవాలు వేసి 10 రోజులు నీళ్లు పోస్తే చాలు.

వాటికి అవే పెరుగుతాయి కాబట్టి రెండు నెలల్లో ఏకంగా 4 అడుగుల ఎత్తు వస్తాయి. అయితే ఆవాలు వచ్చిన తర్వాత ఎండిపోతుంది. ఆ సమయంలో ఆకులను తెంపి ఫ్రై చేసుకోవచ్చు.

మొక్క ఎండిన తర్వాత ఆవాలను తీసి పొట్టు తీసేస్తే కావాల్సిన ఆవాలు సిద్ధంగా ఉంటాయి. 2 నెలల తర్వాత మళ్లీ మట్టి గుల్ల చేసి సేమ్ ప్రాసెస్ చేయవచ్చు.

అందుకే ఇల్ల వద్ద పెంచుకునే మొక్కల్లో ఆవాలను ఉంచుకోవాలి. సులభంగా పెరుగుతాయి. ఇంటి వద్దనే పెరుగుతాయి. ఖర్చు లేని పని కూడా.