నట్స్, గింజలు ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి మీ అందాన్ని పెంచుతాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చర్మం, జుట్టు అందంగా మారుతాయి.

Image Credit : google

యాంటీ ఆక్సిడెంట్లు : బాదం, వాల్‌నట్‌లు, చియా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, వృద్ధాప్యాన్ని రాకుండా చేస్తాయి.

Image Credit : google

ఆరోగ్యకరమైన కొవ్వులు : అవిసె గింజలు, వాల్‌నట్‌లలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు మీ చర్మాన్ని హైడ్రేట్‌గా, మృదువుగా ఉంచుతాయి.

Image Credit : google

విటమిన్ ఇ : బాదం వంటి నట్స్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మాన్ని రక్షించడంలో సహాయం చేసి, మెరిసేలా చేస్తాయి.

Image Credit : google

బయోటిన్ : బాదం , పొద్దుతిరుగుడు వంటి గింజలలో లభించే బయోటిన్, జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. జుట్టు చిట్లకుండా కాపాడుతాయి. అంతేకాదు జుట్టు పెరుగుతుంది.

Image Credit : google

జింక్ : గుమ్మడికాయ గింజల్లో జింక్ ఉంటుంది. ఆయిల్ ఉత్పత్తిని నియంత్రించి మొటిమలను తొలగిస్తుంది.

Image Credit : google

ఫైబర్ : గింజల్లోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. స్కిన్ ను మెరిసేలా చేసి, చర్మ రక్షణకు సహాయం చేస్తుంది.

Image Credit : google

ప్రోటీన్ : ప్రోటీన్-రిచ్ నట్స్, విత్తనాలు చర్మ కణాలను రక్షిస్తాయి. అంతేకాదు యవ్వన ఛాయను అందిస్తాయి.

Image Credit : google

మెగ్నీషియం : జీడిపప్పు వంటి గింజలలోని మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు కూడా రావు.

Image Credit : google