మన దేశం చైనా నుంచి మొదలు పెడితే పాకిస్తాన్ దేశం వరకు సరిహద్దులు కలిగి ఉంది.   మన దేశంతో సరిహద్దు పంచుకునే దేశాలేంటో చూద్దాం.

బంగ్లాదేశ్ ఈ దేశంతో మనకు 4,096 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో పశ్చిమబెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలు ఉన్నాయి.

మయన్మార్ మన దేశానికి ఈశాన్యాన ఈ దేశం ఉంటుంది. 1,458  కిలోమీటర్ల సరిహద్దు రేఖ ఈ దేశంతో ఉంది.. ఈ దేశానికి సరిహద్దు పరిధిలో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

నేపాల్ హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉన్న దేశం ఇది. మన దేశం నేపాల్ తో 1,752 కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది. ఈ సరిహద్దు పరిధిలో పశ్చిమబెంగాల్, బీహార్, సిక్కిం, ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

చైనా చైనా దేశంతో మనకు 3,917 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో జమ్ము కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖాండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

భూటాన్ ఈ దేశం తో మనకు 587 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీని పరిధిలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

పాకిస్తాన్ పాకిస్తాన్ దేశంతో మనకు 3,310 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో గుజరాత్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్,  రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశంతో మనకు 80 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు పరిధిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం విస్తరించి ఉంది.

Off-white Banner

Thanks For Reading...