నవరాత్రి వేడుకలు ఈ నగరాల్లో అద్భుతంగా జరుగుతాయి. కుదిరితే వెళ్లండి.

Images source: google

నవరాత్రి, అంటే "తొమ్మిది రాత్రులు", భారతదేశమంతటా ఉత్సాహంతో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఏ ప్రాంతాల్లో సూపర్ గా నవరాత్రులు జరుగుతాయో తెలుసా?

Images source: google

అహ్మదాబాద్: నవరాత్రి ఉత్సవాల్లో గర్బా, దాండియాలు ఎక్కువ జరుగుతాయి. అహ్మదాబాద్ వీటికి ప్రసిద్ధి చెందింది. ప్రజలు రంగురంగుల సాంప్రదాయ వస్త్రధారణతో ఉంటే వీధులంతా సంగీతం, నృత్యంతో మారుమోగుతాయి.

Images source: google

కోల్‌కతా: దుర్గా పూజ సమయంలో కోల్‌కతా సందర్శించడానికి ఉత్తమ సమయం.  పందాలు, కళకళలాడే కళాఖండాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నిండిపోతుంది కోల్ కతా.

Images source: google

వడోదర: గుజరాత్‌లోని ఈ నగరంలో నవరాత్రి వేడుకలు అత్యంత ఆకర్షణీయంగా జరుగుతాయి.

Images source: google

సూరత్: ఈ నగరం తరచుగా ప్రసిద్ధ కళాకారులు, ప్రదర్శకులతో నిండి ఉంటుంది. ఇక నవరాత్రుల సమయంలో మరింత ఎక్కువ ఉంటారు. ఇక్కడ గర్బా వేడుకలు ఘనంగా జరుగుతాయి.

Images source: google

ముంబై: ముంబైలో, ప్రాంతీయ, గుజరాతీ సంస్కృతి కలయికతో నవరాత్రి, గర్బా జరుగుతుంది.

Images source: google

ఢిల్లీ: భారతదేశ రాజధాని నగరం విభిన్న జనాభాను కలిగి ఉంటుంది. ఇక్కడ జరిగే నవరాత్రి, గర్బా వేడుకలు దీన్ని ప్రతిబింబిస్తాయి. నగరంలోని వివిధ కమ్యూనిటీలు తమ ప్రత్యేక శైలులు, సంగీతంతో జరుపుకుంటారు.

Images source: google

హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగే నవరాత్రి ఉత్సవాలు సాంస్కృతిక ప్రభావాల సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. వివిధ రాష్ట్రాల ప్రజలు గర్బాను, బతుకమ్మను, దుర్గా పూజలతో నగరాన్ని అందంగా మలుస్తారు.

Images source: google