Images source: google
పంట పొలాలకు కంచెలుగా నల్ల తుమ్మచెట్టును ఉపయోగిస్తారు. ఈ చెట్టు కలపతో బొమ్మలు, పడవలు, వివిధ రకాల ఫర్నీచర్ చేయవచ్చు.
Images source: google
ఈ చెట్టు బెరడు తీసుకొని అందులో దాని జిగురును, కాయలను కూడా తీసుకోవాలి. వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. ఈ మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు. వెన్ను నొప్పి తగ్గుతుందట.
Images source: google
నల్ల తుమ్మ ఆకులు కూడా చాలా ఉపయోగపడతాయి. లేత నల్ల తుమ్మ ఆకులను జ్యూస్ గా చేసుకొని తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పి దూరం అవుతుంది.
Images source: google
ఈ చెట్టు కాయలను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. దీనిలో కొన్ని నీళ్లు కలిపి కండె చక్కెరను వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని తీసుకుంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
Images source: google
ఈ చెట్టు బెరడుతో కషాయాన్ని చేయాలి. దీన్ని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మివేయాలి. దీనివల్ల నోటిపూత, నోటిలో ఇతర సమస్యలు తగ్గుతాయి.
Images source: google
తుమ్మ ఆకులను వాము , జీలకర్ర కలిపి కషాయంలా చేసుకోవాలి. దీన్ని తాగితే డయేరియా సమస్య తగ్గుతుంది. ఇలా నల్ల తుమ్మ చాలా ఉపయోగపడుతుంది.
Images source: google
నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేయాలి. పాలల్లో కలిపి తాగితే మంచిది. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడమే కాదు విరిగిన ఎముకలు సైతం అతుక్కుంటాయి.
Images source: google