https://oktelugu.com/

ఐపీఎల్ వేలంలో వీరిపై.. ముంబై ఇండియన్స్ ప్రత్యేక దృష్టి

Images source: google

మరి కొద్ది రోజుల్లో రియాద్ వేదికగా ఐపీఎల్ వేలం జరగనుంది. దీనికి సంబంధించి బిసిసిఐ ఏర్పాట్లు మొదలు పెట్టింది.

Images source: google

నవంబర్ చివరి వారంలో ఈ వేలం ప్రక్రియ నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Images source: google

ఈ వేలంలో ప్రధానంగా ముంబై ఇండియన్స్ పై అందరి దృష్టి ఉంది. బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, రోహిత్ శర్మను ముంబై జట్టు రిటైన్ చేసుకుంది.

Images source: google

ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన చరిత్ర ముంబై ఇండియన్స్ జట్టుకు ఉంది. ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన టీమ్ ఇది.

Images source: google

వచ్చే ఐపీఎల్ కోసం ముంబై ఇండియన్స్ జట్టు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా పలువురు క్రీడాకారులను వేలంలో దక్కించుకోవాలని భావిస్తోంది.

Images source: google

ఇంగ్లాండ్ దేశానికి చెందిన జోస్ బట్లర్, సౌత్ ఆఫ్రికా కు చెందిన క్వింటన్ డికాక్, న్యూజిలాండ్ కు చెందిన బౌల్ట్ ను దక్కించుకోవాలని భావిస్తోంది.

Images source: google

మన దేశానికి చెందిన కృనాల్ పాండ్యా, యజువేంద్ర చాహల్ ను వేలంలో కొనుగోలు చేయాలని యోచిస్తోంది.

Images source: google

గత రెండు సీజన్లలో ముంబై జట్టు దారుణమైన ప్రదర్శన చూపించింది.. దీంతో ఈసారి మెరుగైన జట్టును నిర్మించుకునేందుకు యాజమాన్యం పావులు కలుపుతోంది.

Images source: google

గత సీజన్లో రోహిత్ శర్మను పక్కనపెట్టి.. హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ అప్పగించింది.

Images source: google