https://oktelugu.com/

తెల్ల ఉల్లితో ఎన్నో ప్రయోజనాలు..

Images source: google

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. మార్కెట్‌లో ఎర్ర ఉల్లితో పాటు తెల్ల ఉల్లిగడ్డలు కూడా లభిస్తాయి.

Images source: google

ఎర్ర ఉల్లికంటే తెల్ల ఉల్లిలో విటమిన్‌ సి, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోన్యూట్రియెంట్‌ లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

Images source: google

పచ్చిగా కానీ, ఉడికించి కానీ తెల్ల ఉల్లిగడ్డలను డైట్ లో యాడ్ చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి వీటికి ఉంటుంది.

Images source: google

తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీలో వినియోగిస్తారు. వీటిలోని క్రోమియం, సల్ఫర్‌లు రక్తంలోని చక్కెర నియంత్రణకు తోడ్పడతాయి.

Images source: google

తెల్ల ఉల్లిగడ్డలను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇందులోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

శరీరంలో కణితి పెరుగుదలను నిరోధించే గుణాలు తెల్ల ఉల్లిలో ఉన్నాయి. అంతేకాదు ఇది యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయం చేస్తాయి.

Images source: google

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది.

Images source: google