ప్రోటీన్ లోపం ఉంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి..

Images source: google

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. శరీరంలో ప్రొటీన్ లోపం ఉంటే వ్యాధులు వస్తాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

ప్రోటీన్: ప్రోటీన్ లోపం విటమిన్ B12 లోపంతో సమానంగా ఉంటాయట. జుట్టు ఊడిపోవడం, కండరాల నొప్పి, ఎముక సమస్యలు,ఆకలి పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Images source: google

లోపం లక్షణాలు: ప్రొటీన్లు లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీని వల్ల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆహార అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించాలి.

Images source: google

ఎగ్: గుడ్లలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు ప్రోటీన్ కూడా ఎక్కువే లభిస్తుంది.అందుకే రోజూ కనీసం ఒక గుడ్డు తినాలి.

Images source: google

పాల ఉత్పత్తులు: ప్రోటీన్ లోపాన్ని ఎదుర్కోవడంలో పాల ఉత్పత్తులు ఎక్కువ సహాయం చేస్తాయి. పనీర్‌లో కాల్షియం లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇక ఇందులో కార్బోహైడ్రేట్లు  తక్కువ.

Images source: google

పప్పులు:  సోయాబీన్స్, పప్పులు, శనగలు, బీన్స్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ప్రొటీన్ లోపం తొలగిపోతుంది అంటున్నారు నిపుణులు. ప్రతిరోజూ ఒక గిన్నె పప్పులను ఆహారంలో యాడ్ చేసుకోవాలి.

Images source: google

డ్రై ఫ్రూట్స్: బాదం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రై ఫూట్స్ తినాలి. వీటివల్ల శక్తి అందుతుంది. ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువే. శరీరంలో ప్రోటీన్ లోపం ఉండకూడదు అంటే డ్రై ఫ్రూట్స్ తినాలి.

Images source: google