ఉసిరి, కుంకుడు కాయ, షికాకాయ్ ల వల్ల జుట్టు నాణ్యత మెరుగుపడుతుంది. జుట్టు పొడవుగా, బలంగా నునుపుగా మారుతుంది కూడా. మరి వీటితో షాంపూ ఎలా తయారు చేసుకోవాలో ఓ సారి చూసేద్దామా?
Image Source: Google
కావలసినవి: ముందుగా మూడింటిని ఎండినవే తీసుకోవాలి. లేదంటే ఎండబెట్టాలి. మీకు ఎండినవి షాపుల్లో లభిస్తాయి.
Image Source: Google
నానాలి: 5- 6 కుంకుడు కాయ, 6- 7 షికాకా, 5- 6 ఉసిరికాయలు తీసుకోవాలి. వీటిని రాత్రి మొత్తం నానబెట్టాలి.
Image Source: Google
ఉడకబెట్టడం: మరుసటి రోజు, వీటిని ఉడకబెట్టి, ఆ తర్వాత చల్లారనివ్వాలి.
Image Source: Google
బ్లెండింగ్: చల్లారిన వీటికి కాస్త నీరు కలిపి మిక్సీ వేయాలి. అందులో నుంచి వచ్చిన గుజ్జును వేరు చేసి మిగిలిన రసాన్ని షాంపూగా ఉపయోగించుకోవాలి.
Image Source: Google
నిల్వ: ఒక శుభ్రమైన గాజు కూజాలో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని 15 రోజుల వరకు మీరు ఉపయోగించుకోవచ్చు.
Image Source: Google
ప్రతి రోజు: దీన్ని ప్రతిరోజూ ఉపయోగించుకోవచ్చు. కానీ అతిగా వాడటం మంచిది కాదు. ఆ తర్వాత తేడాను మీరే గమనిస్తారు. కానీ ఈ షాంపూ వల్ల మీకు వెంటనే ప్రయోజనాలు అందవు. సో వెయిట్ చేయాలి.
Image Source: Google
వినియోగం: అన్నింటిని ఎక్కువగా కలపగకుండా ఒక్కొక్కటి గరిష్టంగా 5- 6 కాయలను మాత్రమే తీసుకోండి. ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కాల్ప్‌లో ఉన్న సహజ నూనెలకు ఇబ్బంది కలిగిస్తాయి.
Image Source: Google