ఆధునిక భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని సరికొత్త అధ్యాయాలు సృష్టించారు.

Images source: google

వీరు ముగ్గురు భారత జట్టుకు నాయకత్వం వహించారు. అద్భుతమైన విజయాలను అందించారు.

Images source: google

ధోని ఆధ్వర్యంలో టీమిండియా 2007 t20 వరల్డ్ కప్, 2011 ఐసీసీ వన్డే వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది.

Images source: google

ధోని 332 మ్యాచ్ లకు సారథ్యం వహించాడు. 53 విజయాల శాతంతో తన కెరియర్ ను ముగించాడు.

Images source: google

విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ప్రవేశించింది. వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని ఆక్రమించింది.

Images source: google

విరాట్ కోహ్లీ 213 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. 63% విజయాలను అతని ఆధ్వర్యంలో భారత్ సాధించింది.

Images source: google

రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీమిండియా 2023లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్ చేరుకుంది. 2024 లో టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది.

Images source: google

రోహిత్ శర్మ ఇప్పటివరకు 126 మ్యాచ్లలో భారత్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి ఆధ్వర్యంలో టీమిండియా 73.8% విజయాలను నమోదు చేసింది.

Images source: google