https://oktelugu.com/

బాహుబలి సినిమాకు ముందుగా రానాను అనుకోలేదట. మరి ఎవరో తెలుసా?

బాహుబలి ది బిగినింగ్ (2015) బాహుబలి 2 ది కన్‌క్లూజన్ (2017) సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించాయి.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తే.. రానా దగ్గుబాటి విలన్ పాత్రలో అంటే భల్లాలదేవగా నటించాడు.

రీసెంట్ గా రానా దగ్గుబాటి తన పాత్ర గురించి మాట్లాడారు. ఇందులో విలన్ పాత్రకు ముందుగా రానాను అనుకోలేదట.

దర్శకనిర్మాతలు మొదట హాలీవుడ్ స్టార్ జాసన్ మోమోవాను సంప్రదించారట. మరి రానాను ఎలా సెలక్ట్ చేశారు అనుకుంటున్నారా?

గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఖల్ డ్రోగో పాత్రలో నటించారు జాసన్ మోమోవా. అయితే ఈ సీజన్ ను కంటిన్యూ చేయడంతో బాహుబలిలో నటించలేకపోయారట.

ఆ తర్వాత ఈ పాత్ర కోసం రానాను కలిసినిప్పుడు  'ఆహ్, గ్రేట్! అన్నారట. అంతేకాదు నెగటివ్ రోల్ అయినా ఒకేచెప్పారట రానా.

రానా నటించిన ఈ సినిమాలో తన పాత్రకు IIFA ఉత్సవం అవార్డు అందుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రూ. 2,000 కోట్లకు పైగా వసూలు చేశాయి బాహుబలి సినిమాలు.