https://oktelugu.com/

ఐపీఎల్ లో జాక్ పాట్.. ఆర్ఆర్ క్రికెటర్ జీతం ఏకంగా 7000 శాతం పెరిగింది

Images source: google

2025 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి రిటైన్ జాబితాను మిగతా జట్ల మాదిరిగానే రాజస్థాన్ రాయల్స్ వెల్లడించింది.

Images source: google

గత నాలుగు సీజన్లకు సంజు శాంసన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్ కు కూడా అతడు అదే బాధ్యతలో కొనసాగనున్నాడు.

Images source: google

సంజు తోపాటు యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, హిట్ మేయర్, సందీప్ శర్మ ను ఆర్ ఆర్ రిటైన్ చేసుకుంది.

Images source: google

రాజస్థాన్ జట్టు ఎక్కువగా యువ ఆటగాళ్ల వైపే మొగ్గుచూపింది. వారికోసం భారీగానే డబ్బు ఖర్చు చేసింది. కోట్లకు కోట్లు కుమ్మరించింది.

Images source: google

ధృవ్ జురెల్ కు 14 కోట్లు చెల్లించి రాజస్థాన్ అంటిపెట్టుకుంది. గత సీజన్లో అతడికి 20 లక్షలు మాత్రమే చెల్లించింది.

Images source: google

జురెల్ ఐపీఎల్ 2024లో అద్భుతంగా ఆడాడు. ఏకంగా 172.2 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు. రాజస్థాన్ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు.

Images source: google

జురెల్ 11 ఇన్నింగ్స్ లలో 195 పరుగులు చేశాడు. అతడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే ఈ పరుగులు చేశాడు.

Images source: google

జురెల్ ఈ సీజన్లోనూ అద్భుతంగా ఆడతాడని రాజస్థాన్ జట్టు అంచనా వేస్తోంది. అందులో భాగంగానే అతడిని తీసుకున్నట్టు చెబుతోంది.

Images source: google

గత సీజన్లో రాజస్థాన్ జట్టు అద్భుతమైన ఆట తీరు చూపించింది. ట్రోఫీని దక్కించుకుంటుందని భావించినప్పటికీ..సన్ రైజర్స్ చేతిలో ఓడింది.

Images source: google