జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. కేవలం జుట్టు విషయంలో మాత్రమే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహిస్తే జుట్టు రాలిపోవడం తగ్గి బలంగా తయారు అవుతుంది.

Images source: google

ప్రస్తుతం యువత ఎక్కువగా రసాయనాలు ఉండే నూనెలు, షాంపూలు వాడుతున్నారు. వీటివల్ల ముఖ్యంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది.

Images source: google

వీటికి బదులు సికాయ్, కుంకుడు కాయలు వంటివి వాడితే జుట్టు బలంగా పెరుగుతుంది. ఈరోజుల్లో చాలామంది ఫ్యాషన్‌కి అలవాటు అయ్యి.. జుట్టుకు ఆయిల్ రాయడం లేదు. దీనివల్ల కురులు పగుళ్లు రావడంతో పాటు జుట్టు పలుచగా అయిపోతుంది.

Images source: google

కాబట్టి వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు జుట్టుకు కుదుళ్ల నుంచి ఆయిల్ రాసి మర్దన చేయాలి. వీలైతే ఇలా రోజూ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Images source: google

పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. బాదం, పాలకూర, పాలు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో పాటు గుడ్లు, చీజ్, ఓట్స్, సోయా, తృణధాన్యాలు, చేపలు వంటివి తీసుకోవాలి.

Images source: google

జుట్టు పెరుగుదలకు తోడ్పడే కెరాటిన్‌ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అప్పుడే జుట్టు బలంగా పెరుగుతుంది.

Images source: google

ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు ఉండకూడదు. ఒత్తిడి, మానసికంగా ఇబ్బంది పడుతుంటే జుట్టు ఎక్కువగా రాలుతుంది.

Images source: google

దీన్ని తగ్గించడానికి డైలీ యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే ఒత్తిడి తగ్గి.. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. వీటితో పాటు జుట్టు ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి.

Images source: google

ఇంట్లో దొరికే వస్తువులతో హెయిర్ ప్యాక్‌లు వేసుకోవాలి. ముఖ్యంగా మందార ఆకు, మెంతులు, ఉల్లిపాయ, కరివేపాకు కలిపి ప్యాక్‌గా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి కనీసం ఒక్కసారైన అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు దృఢంగా పెరుగుతుంది.

Images source: google