ధర్మశాలలో RCB చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్ తన ప్లేఆఫ్ ఆశలను వదిలేసుకుంది.

11 గేమ్‌లు ఆడి 8 పాయింట్లతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌ కు చేరుకోవడానికి ఎటువంటి పోటీలో లేదు.

పంజాబ్ , ముంబై రెండూ 12 పాయింట్లతో సీజన్‌ను ముగించే ఛాన్స్ ఉంది. మిగిలిన 8 జట్లు తొలి నాలుగు స్థానాల కోసం పోటీపడనున్నాయి.

లీగ్ పట్టికలో కేకేఆర్, ఆర్ఆర్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో మూడు మ్యాచ్‌లు ఉండగా 12 పాయింట్లు ఉన్నాయి.

ప్రస్తుత చాంప్‌లతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా 18 పాయింట్లను లక్ష్యంగా చేసుకుంది. సన్ రైజర్స్ , సీఎస్కే మిగిలిన గేమ్‌లలో ఏదైనా ఓడిపోతే ఇతర జట్లకు ప్లేఆఫ్ ఆశలు ఉంటాయి.

ఆర్సీబీ 16 పాయింట్లను చేరుకోవడానికి వారు అన్ని మ్యాచ్‌లను తప్పక గెలవాలి.

ఢిల్లీ కేపిటల్స్ తన తదుపరి మ్యాచ్ లో ముంబై, లక్నోలను ఓడిస్తే 16 పాయింట్లను పొంది ప్లేఆఫ్ కు చేరుకుంటుంది. ఢిల్లీ కేపిటల్స్ ప్రస్తుతం 5వ స్థానంలో 12 పాయింట్లతో ప్లేఆఫ్ రేసులో ఉంది.

ఎక్కువ జట్లు 16 పాయింట్లతో ముగిస్తే, నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది..

చివరి స్థానంలో  ఉన్న గుజరాత్ తన చివరి మూడు గేమ్‌లను గెలవడం ద్వారా 14 పాయింట్లను పొంది ప్లేఆఫ్ రేసులోకి వస్తుంది.

Off-white Banner

Thanks For Reading...