ఎక్కువ గంటలు పని చేస్తే.. అనారోగ్య సమస్యలు తప్పవా?

Images source: google

సాధారణంగా ఆఫీస్‌లో రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ ఈ రోజుల్లో చాలా కంపెనీలు రోజుకి 14 నుంచి 15 గంటలు పాటు వర్క్ చేయించుకుంటున్నాయి. దీంతో చాలా మంది ఒత్తిడికి గురై అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

Images source: google

 అసలు కదలకుండా ఒకే ప్లేస్‌లో కూర్చుని కంప్యూటర్ల ముందు అతుక్కుపోతున్నారు. దీంతో లేనిపోని అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

Images source: google

శరీరానికి నిద్ర, విశ్రాంతి తప్పనిసరి. ఎక్కువ గంటలు పనిచేసిన దానికి తగ్గ విశ్రాంతి బాడీకి ఇవ్వాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

Images source: google

విశ్రాంతి లేకుండా రోజుకి ఎక్కువ గంటలు పనిచేస్తే మెదడు దెబ్బతింటుంది. ఒత్తిడికి లోనయ్యి.. ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు.

Images source: google

అదే కూర్చుని ఎక్కువ గంటలు పనిచేసే వాళ్లలో అయితే ఊబకాయం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఒకే ప్లేస్‌లో ఉండి.. గంటల తరబడి పనిచేస్తే మెదడు ఒత్తిడికి గురి అవుతుంది. దీంతో చేసే పని కూడా సరిగ్గా చేయలేరు.

Images source: google

 పనిచేసే ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే చేసే పని మీద కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లేకపోతే సరైన సమయానికి ఒక్క పని కూడా సరిగ్గా జరగదు. అంతా గందరగోళంగా ఉంటుంది.

Images source: google

వర్క్ మధ్యలో విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల బాడీ బాగా అలసిపోతుంది. దీంతో శరీరంలో రక్తప్రసరణ జరగక.. గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది.

Images source: google

రోజంతా నీరు ఎక్కువగా తాగడంతో పాటు తాజా పండ్లు, రసాలు, ఆకుకూరలు, పోషకాలు ఉండే పదార్థాలను తీసుకోవాలి.

Images source: google

పని ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే రన్నింగ్, వాకింగ్, వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. బయట వాతావరణంలో ఇలా చేయడం వల్ల కాస్త ప్రశాంతత లభిస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

Images source: google