https://oktelugu.com/

సన్నగా ఉన్నారా? అయితే ఇలా చేయండి బొద్దుగా అవుతారు..

Images source: google

సన్నగా: కొందరు మరీ సన్నగా ఉంటారు. ఎముకలు కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు శరీరం మీద కచ్చితంగా దృష్టి పెట్టాలి. లేదంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

Images source: google

కేలరీలు: ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని మీ డైట్ లో భాగం చేసుకోవాలి. కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఎముకలు బయటకి కనిపించవు.

Images source: google

పోషకాహారం: కడుపు నిండేలా అన్నం తినడం వల్ల ఉపయోగం ఉండదు. ఈ ఆహారం పోషక విలువలతో కూడి ఉండాలి. ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్, గింజలు వంటివి తీసుకోవడానికి ప్రయత్నించండి.

Images source: google

ధాన్యాలు: ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు బరువు కూడా పెరుగుతారు. అలాగే ఈ పదార్థాలు తీసుకోవడం వల్ల కండలు దృఢంగా అవుతాయి.

Images source: google

ప్రోటీన్: కోడి గుడ్లు, డైరీ ప్రొడక్ట్స్, చేపలు వంటి ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటే కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారు. దీనితో పాటు బరువు కూడా పెరుగుతారు అంటున్నారు నిపుణులు.

Images source: google

తినడం: ఒకేసారి ప్లేట్ నిండా పెట్టుకొని తినవద్దు. కొంచెం కొంచెం రోజులో కనీసం  5 నుంచి 6 సార్లు తినండి. దీని వల్ల త్వరగా బరువు పెరుగుతారు.

Images source: google

అల్పాహారం: అల్పాహారం సమయంలో అరటి పండ్లు, పీనట్ బటర్, పాలు, ఓట్స్ తో కూడిన స్మూతీస్ ఉండేలా చూసుకోండి. ఇలా చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంది.

Images source: google