అన్ని బంధాల కంటే భార్యభర్తల బంధం చాలా గొప్పది అంటారు పెద్దలు. ఎక్కడో పుట్టి ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా కేవలం తాళి వల్ల ఇద్దరు కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు.

పెళ్లి తర్వాత కలిసి ఉండాలి కానీ ఈ మధ్యల చాలా జంటలు విడిపోతున్నాయి. చిన్న చిన్న గొడవలకే విడాకుల వరకు వెళ్తున్నారు.

భార్య మీద ఎంత కోపం వచ్చినా సరే ఆమె మీద గట్టిగా అరిచి మాట్లాడని భర్త అంటే భార్యకు ప్రాణం కంటే ఎక్కువనట.

నా భార్య ఇలా అలా వంట చేయదు, పని చేయదు అంటూ చెప్పే భర్తల ఉన్న కాలంలో తన గురించి ఇతరుల మధ్య చెడుగా చెప్పకూడదు అనుకుంటుంది మీ భార్యామణి.

అక్రమ సంబంధాలు పెరుగుతున్న సందర్భంగా తన భర్త తనతో మాత్రమే ఉండాలని.. ప్రేమ ఆప్యాయతలను  కూడా తనతోనే పంచుకోవాలి అనుకుంటుంది.

పక్కింటి ఆవిడ ఉద్యోగం చేస్తుంది, సంపాదిస్తుంది. భర్తకు సాయం చేస్తుంది అంటూ ఇతరులతో పోల్చకూడదు. ఏ విషయంలో అయినా పోలిక నచ్చదు.

అనిగి మనిగి ఉన్నా. భర్తే ప్రాణంగా భావిస్తున్నా కూడా అనుమానించడం, అవమానించడం చేయడం అసలు నచ్చదు. సో వీటికి పులిస్టాప్ పెట్టాలి.

ఇలాంటి లక్షణాలు ఉన్న భర్తను భార్య ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుంది. తనే ఆమె ప్రపంచంగా బతికేస్తుంది.

Off-white Banner

Thanks For Reading...