ఈ రొటీన్ ఫాలో అయితే మీ బెల్లీ ఫ్యాట్ మాయం..

Images source: google

బెల్లీ ఫ్యాట్ అధికంగా పెరిగితే గుండెపోటు, డయాబెటిస్, కాలేయ సంబంధ సమస్యలు వస్తాయి. ఉదయం కొన్ని పనులు చేస్తే ఈ బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు.

Images source: google

వ్యాయామం: ఉదయం వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.  బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. వాకింగ్, యోగా, జాగింగ్ అరగంటసేపు చేస్తే చాలు మంచి ఫలితాలు ఉంటాయి.

Images source: google

వాటర్: ఉదయం లేవగానే నీళ్లు తాగాలి. అర లీటర్ నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. ఈ వాటర్‌లో నిమ్మరసం కలపండి. దీనివల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.

Images source: google

ఆహారం: ఆహారాన్ని మెల్లగా నములుతూ తినాలి. అవసరం ఉన్నంత మాత్రమే తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. మొబైల్, టీవీ చూస్తూ అసలు తినవద్దు.

Images source: google

ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్: ప్రోటీన్ అధికంగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. ఉదయాన్నే ఎగ్స్, యోగర్ట్, ప్రోటీన్ స్మూతీలాంటివి తీసుకోండి.

Images source: google

ఒత్తిడి: ఒత్తిడి వల్ల తొందరగా బరువు పెరుగుతుంటారు. దీని ప్రభావం బెల్లీ ఫ్యాట్ మీద ఉంటుంది. అందుకే రోజూ మెడిటేషన్ వంటివి చేస్తూ ఒత్తడిని నియంత్రించుకోవాలి.

Images source: google

నిద్ర: బరువు అదుపులో ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమి వల్ల హార్మోన్ల స్థాయిల్లో సమతుల్యం లోపిస్తుంది. తద్వారా ఆకలి పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి కారణం. రోజుకు కనీసం 7-8 గంటలు నిద్ర చాలా అవసరం.

Images source: google